తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ కీలక నాయకుల నుంచి ద్వితీయ శ్రేణి నేతల వరకు ఎక్కడిక క్కడ అరెస్టులు అవుతున్నారు. ఈ వ్యవహారంపై ఆ పార్టీ సీనియర్లు, మాజీ మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రస్థాయిలో తప్పుబడుతున్నారు. మాజీ మంత్రి, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్.. తలసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం ఉదయం భారీ నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో అలెర్టయిన పోలీసులు బీఆర్ ఎస్ నాయకులను అరెస్తు చేస్తున్నారు.
అయితే.. ప్రభుత్వం ఎంత నిర్బంధించినా తమ ఆందోళనను, ప్రజాగ్రహాన్ని నిలువరించలేదని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఎంతవరకై నా వెళ్తామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కార్పొరేషన్ల ఏర్పాటు.. ఇప్పటికే ఉన్న వాటిని మరింత కదప డం వంటివిషయాలను బీఆర్ ఎస్ తీవ్రంగా తప్పుబడుతోంది. ఈ క్రమంలో ముఖ్యంగా సికింద్రబాద్ కార్పొ రేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే నిరసనకు పిలుపునిచ్చింది. సికింద్రాబాద్‌ను ప్రత్యేక మునిసిపల్ కార్పొరేషన్‌గా ఏర్పా టు చేయాలని.. బీఆర్ ఎస్ నాయకులు కోరుతున్నారు. దీనిలోని కొన్ని ప్రాంతాలను విడదీసి.. సికింద్రాబా ద్ అస్తిత్వానికే ప్రమాదం తీసుకువస్తున్నారని చెబుతున్నారు. అదేసమయంలో సికింద్రాబాద్ పేరును కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారని తలసాని పేర్కొన్నారు. వీటిని అడ్డుకునేందుకు తాము ఎంత వరకైనా వెళ్తామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం సికింద్రబాద్ వరకు.. నిరసన చేపట్టారు.
ఎక్కడికక్కడ..
అయితే.. బీఆర్ ఎస్ ఆందోళనలకు, నిరసనలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ నేప థ్యంలోనే అరెస్టు చేయాల్సి వస్తోందని వివరించారు. మరోవైపు.. ఈ వ్యవహారాన్ని మాజీ మంత్రులు కేటీ ఆర్, హరీష్‌రావు తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో ప్రజల నోరు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని... హక్కులపై ఉక్కుపాదం మోపుతున్నారని వారు ఆరోపించారు. దీనిని ప్రజలు గమనించాలని సూచించా రు. పోరాడి సాధించుకున్న తెలంగాణను ముక్కలు చెక్కలు చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.