వెంకీతో అనిల్ మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌.. రేసులో ఆ ఇద్దరు స్టార్స్!

admin
Published by Admin — February 04, 2026 in Movies
News Image

టాలీవుడ్‌లో మినిమమ్ గ్యారెంటీ కాంబినేషన్ అంటే ముందుగా గుర్తొచ్చేది విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి. వీరిద్దరి కలయికలో వచ్చిన `ఎఫ్ 2`, `ఎఫ్ 3`, `సంక్రాంతికి వ‌స్తున్నాం` చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నవ్వుల పూయించడమే కాకుండా వసూళ్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు హ్యాట్రిక్ విజయం తర్వాత, ఈ క్రేజీ కాంబో మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈసారి కేవలం ఫన్ మాత్రమే కాదు, అంతకు మించిన హై-వోల్టేజ్ మల్టీస్టారర్ డోస్‌ను అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో వెంకటేష్‌తో పాటు మరో పవర్‌ఫుల్ రోల్ కోసం దర్శకుడు అనిల్ రావిపూడి కసరత్తు చేస్తున్నార‌ట‌. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం.. ఈ రేసులో తమిళ స్టార్ హీరో కార్తీ మరియు మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కార్తీకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. అటు ఫహాద్ ఫాజిల్ ఇచ్చే స్క్రీన్ ప్రెజెన్స్ కు స‌ప‌రేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో.. ఈ ఇద్దరిలో ఎవరు ఫైనల్ అయినా సినిమా స్థాయి అమాంతం పెరిగిపోవడం ఖాయం.

ఇక‌పోతే అనిల్ రావిపూడికి సంక్రాంతి సీజన్ అంటే ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. తన గత చిత్రాల మాదిరిగానే, ఈ కొత్త మల్టీస్టారర్ మూవీని కూడా 2027 సంక్రాంతి బరిలో నిలపాలని పక్కా ప్లాన్‌తో ఉన్నన‌ట్లు టాక్ న‌డుస్తోంది. కాగా, ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `ఆదర్శ కుటుంబం` అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు క్లాస్ టచ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే, ఏమాత్రం గ్యాప్ లేకుండా అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలని వెంకీ భావిస్తున్నార‌ట‌.

Tags
Venkatesh Anil Ravipudi Victory Venkatesh Sankranthi 2027 Tollywood Updates Multistarrer
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News