ఏపీలో రాజ్య‌స‌భ‌-తెలంగాణ‌లో మండ‌లి.. తేల్చేస్తారా?

admin
Published by Admin — February 04, 2026 in Politics, Andhra, Telangana
News Image

ఏపీలో రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ ఏడాది జూన్ 21 నాటికి నాలుగు స్థానాలు ఖాళీ అవు తున్న నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు కూట‌మి మిత్ర‌ప‌క్షాల నాయ‌కుల‌తో భేటీకి సిద్ధ‌మ‌య్యారు. ఈ భేటీలో ఎవ‌రెవ‌రికి ఎన్ని సీట్లు అనే విష‌యంపై చ‌ర్చించి తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు. వాస్త‌వానికి ఈ సీట్లు ఖాళీ అయ్యేందుకు నాలుగు మాసాల స‌మ‌యం ఉంది. అయితే.. మ‌రో నెల‌లోనే కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ ఇచ్చే అవ‌కాశం ఉంది. దీంతో ఇప్ప‌టి నుంచే సీట్ల స‌ర్దుబాటుపై చ‌ర్చ‌లు ప్రారంభించారు.

ఈ క్ర‌మంలో బుధ‌వారం.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సీఎం చంద్ర‌బాబుతోభేటీ అవుతున్నారు. అదే విధంగా బీజేపీ నేత‌లు కూడా సీఎం చంద్ర‌బాబుతో స‌మావేశం అవుతార‌ని తెలిసింది. ఈ చ‌ర్చ‌ల్లో నాలు గు స్థానాల్లో రెండు టీడీపీ తీసుకుని.. ఒక‌టి జ‌న‌సేన‌కు, బీజేపీకి మ‌రొక‌టి ఇస్తుంద‌ని దీనికి ఆయా పార్టీల‌ను సీఎం చంద్ర‌బాబు ఒప్పిస్తార‌ని తెలిసింది. అయితే.. బీజేపీ రెండు స్థానాలు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్న ద‌రిమిలా.. ఈ చ‌ర్చ‌ల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది.

ఇక‌, తెలంగాణ‌లో రెండు మండ‌లి స్థానాల భ‌ర్తీకి కూడా బుధ‌వారమే ముహూర్తం నిర్ణ‌యించారు. గ‌వ‌ర్న‌ర్ కోటాలో రెండు మండ‌లి సీట్లు భ‌ర్తీ కానున్నాయి. ఈ రెండు కూడా అధికార పార్టీ కాంగ్రెస్‌కే ద‌క్క‌నున్నాయి. దీనిపై ఇప్ప‌టికే విచార‌ణ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. సుప్రీంకోర్టు ఈ సీట్ల భ‌ర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ద‌రిమిలా.. బుధ‌వారం ఈ ఎంపిక పూర్తి చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీనిలో భాగంగానే.. పార్టీ కీల‌క నేత‌ల‌తో ఆయ‌న బుధ‌వారం స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు.

మ‌రోవైపు.. నిజామాబాద్ మునిసిప‌ల్ ప్ర‌జాప్ర‌తినిధుల కోటాలో ఎమ్మెల్సీ అయి క‌విత త‌న ప‌ద‌వికి రాజీనా మా చేశారు. దీనికి కూడా.. త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ రానుంది. ఇది ఎన్నిక‌ల పోలింగ్‌తో సంబంధం ఉన్న నేప‌థ్యంలో ఈ విష‌యంపైనా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్యుల‌తో చ‌ర్చించి.. తుది నిర్ణ‌యం తీసుకుం టార‌ని గాంధీ భ‌వ‌న్ వ‌ర్గాలు తెలిపాయి. అనంత‌రం అధిష్టానానికి నివేదిక పంపించి.. అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌నున్నారు. ముఖ్యంగా గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. ఈ ద‌ఫా చ‌ర్య‌లు తీసుకోనున్నారు.

Tags
Andhra Pradesh Politics Telangana Politics Rajya Sabha Polls MLC Elections Seat Sharing
Recent Comments
Leave a Comment

Related News