లాజిక్ తో వైసీపీకి నాగబాబు కౌంటర్

admin
Published by Admin — February 06, 2026 in Andhra
News Image
వైసీపీ అధినేత జ‌గ‌న్.. ఆ పార్టీ నాయ‌కుల‌పై జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. ఈ క్ర‌మంలో ప‌లు కీల‌క విష‌యాల‌ను అంశాల వారీగా ప్ర‌శ్నించారు. త‌ద్వారా వైసీపీని ఆయ‌న నిల‌దీశారు. తొలుత‌.. త‌న‌ను తాను హిందువుగానే ప్ర‌క‌టించుకున్నారు. హిందూత్వం అంటే మ‌తం కాద‌ని.. ధ‌ర్మ‌మ‌ని పేర్కొన్నారు.
 
అంత‌ర్వేది: వైసీపీ హ‌యాంలో జ‌రిగిన అంత‌ర్వేది ఆల‌యం ర‌థం ద‌గ్ధం అయిన ఘ‌ట‌న‌ను ప్ర‌స్తావించిన నాగ‌బాబు.. దీనిపై సీబీఐ విచార‌ణ వేస్తామ‌ని చెప్పిన వైసీపీ చేతులు దులుపుకొంద‌న్నారు. ఇటీవల ఒక‌రు ఆర్టీఐ ద్వారా ఈ వ్య‌వ‌హారాన్ని అడిగిన‌ప్పుడు.. వైసీపీ ప‌న్నాగం బ‌య‌ట ప‌డింద‌న్నారు. హిందువులు అన్నా.. హిందూ ఆల‌యాల‌న్నా వైసీపీకి చుల‌క‌న అనేందుకు ఇదే ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొన్నారు.
 
రామ‌తీర్థం: విజ‌య‌న‌గ‌రం జిల్లా రామ‌తీర్థంలో రాముడి విగ్ర‌హం శిర‌చ్ఛేదం చేసిన‌ఘ‌ట‌న‌ను నాగ‌బాబు ప్ర‌స్తావించారు. ఈ కేసులో కూడా వైసీపీ ప్ర‌భుత్వం మొక్కుబడిగా నేచ‌ర్య‌లు తీసుకుంద‌ని ఆరోపించారు. రాముడి ప‌ట్ల ఎంత ప్రేమో దీనికి ఉదాహ‌ర‌ణ అన్నారు. కానీ, ఒక్క‌రైనా వైసీపీ మాజీ మంత్రులు, నాయ‌కులు ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తారా? అని నిల‌దీశారు. ఈ కేసును మసిపూసి మారేడుకాయ చేశారన్నారు.
 
టీటీడీ: తిరుమ‌ల‌ను ద‌ర్శించుకునేందుకు పేద‌ల నుంచి కోటీశ్వ‌రుల‌కు వ‌రకు వ‌స్తార‌ని.. కానీ, వారిని శ్రీవారికి వైసీపీ ప్ర‌భుత్వం దూరం చేసింద‌న్నారు. తిరుమల కొండపై వైసీపీ దోపిడీ అంతాఇంతా కాదన్న ఆయ‌న గెస్ట్‌హౌజుల్లో 500కు దొరికే రూమ్‌ ఛార్జీలు 1000కి పెంచారన్నారు. టీటీడీ కామన్‌ గుడ్‌ ఫండ్‌ కాంట్రిబ్యూషన్‌ను ఒక్క‌సారిగా 50 కోట్లకు పెంచార‌ని.. ఇది ఎవ‌రి కోసం చేశార‌న్నారు. వేలం పాట పాడిన‌ట్టుగా.. అప్ప‌ట్లో టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచేశార‌ని దుయ్య‌బ‌ట్టారు.
 
డిక్ల‌రేష‌న్‌: అన్య విశ్వాసాల‌ను న‌మ్మేవారు.. తిరుమ‌ల‌కు వ‌స్తే.. డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేస్తార‌ని.. గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ బాలిక కోసం.. డిక్ల‌రేష‌న్ ఇచ్చార‌ని తెలిపారు. ఆ య‌న స‌తీమ‌ణి అన్నా కూడా ఇచ్చార‌ని నాగ‌బాబు వ్యాఖ్యానించారు. మాజీ రాష్ట్ర‌ప‌తి క‌లాం వ‌చ్చిన‌ప్పుడు కూడా డిక్ల‌రేష‌న్ ఇచ్చార‌ని.. ఆయ‌న క‌న్నా నువ్వు గొప్ప‌వాడివా అంటూ.. జ‌గ‌న్‌ను నిల‌దీశారు. డిక్ల‌రేష‌న్ ఇవ్వాల్సి ఉంటుంద‌ని తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌నే క్యాన్సిల్ చేసుకున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.
Tags
janasena mlc nagababu ycp ttd logic questions
Recent Comments
Leave a Comment

Related News