ఏపీలో కూటమి ప్రభుత్వంలో చేతులు కలిపిన బీజేపీ-జనసేన-టీడీపీల సమన్వయానికి సంబంధించిన తాజాగా `కొత్త కమిటీ`ని వేశారు. ఈ మేరకు తాజాగా సీఎం చంద్రబాబు ఈ కమిటీపై కీలక ప్రకటన చేశారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం చేయడానికి ఈ కమిటీ కసరత్తు చేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపా రు. మూడు పార్టీల నేతలను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు కూడీ ఈ కమిటీ కీలకంగా వ్యవహరిస్తుంద న్నారు. ఈ కమిటీలో మూడు పార్టీలకు చెందిన సీనియర్లు ఉండనున్నారు.
ఎందుకు ?
వాస్తవానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 19 మాసాలకు పైగా పూర్తయ్యాయి. మరి ఈ స్వల్ప కాలం లోనే సమన్వయ కమిటీని నియమించడం ఎందుకు? అనేది ప్రధాన అంశం. దీనిలో ప్రధానంగా మూడు కీలక విషయాలు కనిపిస్తున్నాయి. 1) క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య వివాదాలు: ఇవి నిజానాకి కూటమి కట్టడం నుంచే ఉన్నాయి. అయినప్పటికీ.. వైసీపీని అధికారంలో నుంచి దింపేయాలన్న కసితో మూడు పార్టీల నాయకులు 2024 ఎన్నికల్లో కలిసి పనిచేశారు. ఆ తర్వాత.. మళ్లీ వివాదాలు కామన్ అయ్యాయి.
2) ఎవరికివారుగా: క్షేత్రస్థాయిలో మూడు పార్టీల నాయకులు ఎవరికి వారు వారుగా ఉంటున్నారు. కలివిడి, సమన్వయం అనేవి లేకుండా పోయాయి. ఈ విషయాన్ని ఆయా పార్టీల అధినేతలు పదే పదే చెబుతున్నా రు. అయినప్పటికీ.. నాయకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేలు-ఎంపీలకు, ఎమ్మెల్యేలు-క్షేత్రస్థాయి ద్వితీయ శ్రేణి నాయకులకు మధ్య వివాదం ఉన్నాయి. అదేసమయంలో ఒక పార్టీ నాయకులకు మరో పార్టీ నేతలకు మధ్య కూడా దూరం పెరుగుతోంది.
3) సమస్యలపై: కూటమిలోని మూడు పార్టీల్లో ఏదొ ఒక పార్టీ నిత్యం చర్చల్లోకి వస్తోంది. అది నాయకుల పరంగానా.. లేక విధానాల పరంగా అయినా.. ఏదో ఒక సమస్య వెంటాడుతోంది. వైసీపీ దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తోంది. ఈ పరిణామాలను అడ్డుకునేందుకు నాయకులు కలసి కట్టుగా కౌంటర్ ఇవ్వాలన్నది ప్రధాన ఉద్దేశం. కూటమిలో ఏ పార్టీని నొప్పి కలిగినా.. అందరూ కలిసి కట్టుగా దానిని ఎదుర్కొనాలన్నది ప్రధాన భావన. అందుకే.. నాయకుల మధ్య సమన్వయానికి కమిటీని ఏర్పాటు చేస్తున్నారు.