హైదరాబాద్‌లో నడిబొడ్డున ఉన్న నాంపల్లిలో తరచుగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి షార్ట్ సర్క్యూట్ కారణమని అంటున్నా.. వెలుగు చూస్తున్న నిజాలు వేరేగా ఉంటున్నాయి. తాజాగా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో లక్షలాది మంది డీఎన్ ఏ సహా.. వేలి ముద్రల ఫైళ్లు.. ధ్వంసమైనట్టు తెలిసింది. పోలీసులు ఈ విషయాలను వెల్లడించడం లేదు.
కారణం ఏదైనా.. ప్రస్తుతం ఈ వ్యవహారంపై అనేక విమర్శలు వస్తున్నాయి. శనివారం ఉదయం భవనం తొలి అంతస్థులో మంటలు ఎగిసిపడ్డాయి. అనంతరం.. మిగిలిన అంతస్థులకు కూడా మంటలు వ్యాపిం చాయి. దీంతో భవనంలోని కీలకమైన సామగ్రితో పాటు డేటా కూడా ధ్వంసమైనట్టు పోలీసులు నిర్ధారించా రు. అయితే.. ఈ డేటా ఎవరికి సంబంధించింది..? అనే విషయంపై గోప్యత పాటిస్తున్నారు. మరోవైపు ఈ ఘటన వెనుకు ఉద్దేశ పూర్వకమైన నేర పూరిత కుట్రల దాగి ఉన్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తమ వుతున్నాయి.
ఏం జరిగి ఉంటుంది?
కీలక కేసులకు సంబంధించిన డీఎన్ ఏ, అదేవిధంగా సైబర్ క్రైమ్ నేరాలకు సంబంధించిన వేలి ముద్ర లు, ఇతర పాస్ వర్డ్స్ సంబంధిత కీలక సమాచారం ఇక్కడే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే.. ఫోరె న్సిక్ ల్యాబ్‌లో ఏపీ, సహా పలు రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం కూడా ఉందని తెలిసింది. దీంతో ఆయా సమాచారాన్ని ఉద్దేశ పూర్వకంగా ధ్వంసం చేసేందుకు ఈ కుట్ర చేశారా? అనేఅనుమానాలు వ్యక్త మవుతున్నాయి. దీంతో పోలీసులు ఆదిశగా కూడా ఆలోచన చేస్తున్నారు. దర్యాప్తును ముమ్మరం చేశారు.