భారత ప్రధాని నరేంద్ర మోదీ కేవలం పాలనలోనే కాదు, సోషల్ మీడియా ప్రపంచంలోనూ తిరుగులేని రారాజు అని మరోసారి నిరూపించుకున్నారు. యువతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఇన్‌స్టాగ్రామ్ వేదికపై మోదీ 100 మిలియన్ల (10 కోట్లు) ఫాలోవర్ల మైలురాయిని అందుకుని ప్రపంచ చరిత్ర సృష్టించారు. ఈ అద్భుత ఘనత సాధించిన ప్రపంచపు తొలి రాజకీయ నేతగా మోదీ సరికొత్త రికార్డు నెలకొల్పారు.
సాధారణంగా గ్లోబల్ లీడర్లంటే సీరియల్ పాలిటిక్స్ అనుకుంటాం. కానీ మోదీ క్రేజ్ ముందు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వెనుకబడక తప్పలేదు. ట్రంప్‌కు ఉన్న 43.2 మిలియన్ల ఫాలోవర్లను చూస్తే.. మోదీ ఫాలోయింగ్ ఆయన కంటే రెట్టింపు కంటే ఎక్కువే కావడం విశేషం. ఇక ఇండోనేషియా, బ్రెజిల్, తుర్కియే, అర్జెంటీనా వంటి ఆరుగురు దేశాల అధ్యక్షుల ఫాలోవర్లందరినీ కలిపి లెక్కవేసినా, మన ప్రధాని దరిదాపుల్లోకి కూడా రాలేకపోవడం గమనార్హం.
దేశీయ రాజకీయాల్లోనూ ఆయనే `బాస్`..
దేశీయంగా చూసినా మోదీ హవాకు బ్రేకులు లేవు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (16.1 మిలియన్లు), ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (12.6 మిలియన్లు) వంటి హేమాహేమీలు రేసులో ఉన్నప్పటికీ, మోదీ సంఖ్య వారందరికీ అందనంత ఎత్తులో ఉంది. 2014లో ఇన్‌స్టాలో అడుగుపెట్టిన మోదీ, దశాబ్ద కాలంలోనే యువతతో పెంచుకున్న అనుబంధమే ఈ భారీ సక్సెస్‌కు ప్రధాన కారణం.
కేవలం అధికారిక ఫోటోలే కాదు.. అంతర్జాతీయ పర్యటనల్లో ఆయన స్టైల్, స్థానిక కళాకారులతో ముచ్చట్లు, పండుగ వేళల్లో సామాన్యులతో మమేకమవ్వడం వంటి పోస్ట్‌లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తన మనసులోని భావాలను నేరుగా ప్రజలతో పంచుకునే కనెక్టింగ్ పవర్ మోదీని సోషల్ మీడియాలో గ్లోబల్ ఐకాన్ గా నిలబెట్టింది. మొత్తానికి, మోదీ కొట్టిన ఈ ఇన్‌స్టా సెంచరీ ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.