ప్ర‌తిప‌క్ష హోదా...జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు ఆగ్ర‌హం

admin
Published by Admin — March 06, 2026 in Andhra
News Image

ప్ర‌జ‌ల త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యేలు స‌భ‌కు రాకుండా.. ప‌రామ‌ర్శ యాత్ర‌లు చేస్తున్నార‌ని వైసీపీ అధినే త జ‌గ‌న్‌(jagan)పై సీఎం చంద్ర‌బాబు(cm chandrababu) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లు ఇచ్చిన గౌర‌వాన్ని నిల‌బెట్టుకోక‌పోతే.. 11లో 1 కూడా మిగిలే ప‌రిస్థితి ఉండ‌ద‌న్నారు. ప్ర‌జ‌ల త‌ర‌ఫున స‌భ‌కు వ‌స్తే.. రావ‌ద్ద‌ని తాను చెప్పానా? స్పీక‌ర్ చెప్పారా? లేక కూట‌మి స‌భ్యులు ఎవ‌రైనా చెప్పారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. స‌భ‌కు రావాల‌న్న క‌నీస మ‌ర్యాద‌, గౌర‌వం, బాధ్య‌త లేక‌పోవ‌డం... త‌న 45 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో తొలిసారి చూస్తున్నాన న్నారు.

తాను 23 మంది ఎమ్మెల్యేలే గెలిచినా.. స‌భ‌కు వ‌చ్చిన విష‌యాన్ని చంద్ర‌బాబు గుర్తు చేశారు. కానీ.. త‌న‌ను ఘోరంగా అవ‌మానించార‌ని.. అప్పుడు కూడా.. తాను స‌భ‌కు రాక‌పోయినా.. త‌న పార్టీ స‌భ్యుల‌ను పంపించి ప్ర‌జ‌ల త‌ర‌ఫున స‌భ‌లో ప్ర‌శ్న‌లు అడిగించిన విష‌యాన్ని గుర్తు చేశారు. తాజాగా అసెంబ్లీలో మాట్లాడిన చంద్ర‌బాబు.. వైసీపీ స‌భ్యులు స‌భ‌కు రాక‌పోవ‌డంపై స్పందించారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా అనేది ఎవ‌రో ఇస్తే వ‌చ్చేది కాద‌న్నారు. ప్ర‌జ‌లు ఇవ్వాల‌ని.. వైసీపీ నేత‌.. ప్ర‌జ‌ల‌ను అడ‌గాల‌ని వ్యాఖ్యానించారు.

కూట‌మి కుశ‌లం!

రాష్ట్రంలో కూట‌మి పార్టీలు, ప్ర‌భుత్వం కూడా కుశ‌లంగా ఉన్నాయ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. మూడు పార్టీలు పేరుకే అయినా.. ఉమ్మ‌డిగానే నిర్ణ‌యాలు తీసుకుంటున్నామ‌ని, క‌లిసి మెలిసి ఉన్నామ‌ని చెప్పారు. దీనిపై కొంద‌రు యాగీ చేస్తున్నార‌ని.. అంటే.. త‌మ‌ను విడ‌దీయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని.. ఎవ‌రూ వారి వ‌ల‌లో ప‌డ‌బోర‌ని చెప్పారు. ఇది ప్ర‌జ‌లు ఏర్పాటు చేసుకున్న పొత్తు అని అన్నారు. ``ఒక అరాచ‌క శ‌క్తికి వ్య‌తిరేకంగా ఏర్పాటు చేసుకున్న పొత్తు. ప్ర‌జ‌లు దీవించారు`` అని అన్నారు. 94 శాతం మందిని ప్ర‌జ‌లు గెలిపించార‌ని చెప్పారు.

అప్పులు మోపారు!

వైసీపీ హ‌యాంలో చెప్పుకోవ‌డానికి చాలా ఉన్నాయ‌ని చంద్ర‌బాబు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అప్పులు తెచ్చారని.. ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను, కార్యాల‌యాల‌ను కూడా తాక‌ట్టు పెట్టార‌ని వ్యాఖ్యానించారు. ఇష్టానుసా రం అప్పులు చేసి ప్రజలపై భారం మోపారని.. ఇప్పుడు వాటిని రీషెడ్యూల్ చేసి.. వ‌డ్డీల భారం త‌గ్గించామ‌ని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. సూప‌ర్ సిక్స్‌ పథకాలను ప్ర‌జ‌ల‌కు ఇస్తున్నామ‌న్నా రు. వ‌చ్చే ఏడాదికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామ‌ని.. గోదావ‌రి పుష్క‌రాలు.. పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి ఒకేసారి వ‌స్తాయ‌న్నారు. 

Tags
Cm chandrababu ycp jagan opposition status
Recent Comments
Leave a Comment

Related News