ఏపీ, తెలంగాణ‌పై గ్యాస్ సెగ‌.. 2 రోజుల్లో ఏం జ‌ర‌గ‌బోతుంది..?

admin
Published by Admin — March 12, 2026 in Andhra, Telangana
News Image

ప్రపంచం ఒక మూల జరుగుతున్న యుద్ధం, తెలుగు రాష్ట్రాల వంటి సుదూర ప్రాంతాలపై కూడా ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు అర్థమవుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సామాన్యుడి కడుపు కొట్టేలా మారుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రరూపం దాల్చింది. ఇది కేవలం సరఫరా సమస్య మాత్రమే కాదు, రాబోయే రెండు రోజుల్లో మన ఆహారపు అలవాట్లు, హోటల్ మెనూలు మరియు సామాన్యుల జేబులపై పెను ప్రభావం చూపబోతోంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో కమర్షియల్ (నీలం రంగు) గ్యాస్ సిలిండర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు మరియు రోడ్డు పక్కన ఉండే టిఫిన్ సెంటర్లు ఇప్పటికే సతమతమవుతున్నాయి. స్టాక్ లేకపోవడంతో చాలా చోట్ల మెనూలో ఐటమ్స్ తగ్గించేశారు. గ్యాస్ ఆదా చేయాలి కాబట్టి, తక్కువ వంటకాలు మాత్రమే చేస్తున్నాం అని హోటల్ యజమానులు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే, మరో 48 గంటల్లో కొన్ని చిన్న తరహా హోటళ్లు తాత్కాలికంగా బోర్డులు తిప్పేసే ప్రమాదం ఉంది.

ఈ గ్యాస్ సెగ కేవలం హోటళ్లకే పరిమితం కాలేదు. వేల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు ఉండే ప్రైవేట్ హాస్టళ్లపై కూడా దీని ప్రభావం పడింది. సాధారణంగా డొమెస్టిక్ కనెక్షన్లు వాడే వెసులుబాటు లేని పెద్ద హాస్టళ్లు కమర్షియల్ సిలిండర్లపైనే ఆధారపడతాయి. గ్యాస్ దొరకకపోవడంతో వడ్డించే పదార్థాల సంఖ్యను తగ్గించడమే కాకుండా, భోజన సమయాల్లో కూడా మార్పులు చేస్తున్నారు. రేపు, ఎల్లుండి లోపు సరఫరా మెరుగుపడకపోతే, హాస్టల్ మెస్ లు నడపడం కష్టమని నిర్వాహకులు చెబుతున్నారు.

ఇంటి గ్యాస్ పరిస్థితి ఏంటి?
ప్రస్తుతానికి సామాన్యులకు ఊరటనిచ్చే విషయం ఏంటంటే.. ఇంటి అవసరాలకు వాడే డొమెస్టిక్ (ఎర్ర రంగు) సిలిండర్ల పంపిణీ ప్రస్తుతానికి సాధారణంగానే ఉంది. అయితే, కమర్షియల్ సిలిండర్ల కొరత వల్ల కొందరు అక్రమంగా డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో సాధారణ వినియోగదారులకు కూడా వెయిటింగ్ పీరియడ్ పెరిగే ప్రమాదం ఉంది.

Tags
LPG Shortage Ap Telangana Gas Shortage LPG Iran Israel War Andhra Pradesh
Recent Comments
Leave a Comment

Related News