రాజకీయాల్లో శాశ్వత శత్రవులు, శాశ్వత మిత్రులు కూడా ఉండరు. ఒకప్పుడు తనతో తిరిగిన నాయకుడే గతంలో ఎన్టీఆర్‌కు శత్రువయ్యారు. ఇలానే.. వైసీపీ అధినేత జగన్(jagan)కు ఇంటిపోరు పెరుగుతోంది. ఇప్పటికే ఆయన అభిమానులు తగ్గుముఖం పడుతున్నారన్న చర్చ సాగుతోంది. కార్యకర్తలు, నాయకులు ఎలా ఉన్నప్పటికీ.. పార్టీని నడిపించేవారు.. చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. లేకపోతే.. రాజకీయంగా వారిపై ముద్రలు పడతాయి. వాటిని చెరుపుకోవడం కూడా కష్టమే అవుతుంది.
బాబాయ్-గొడ్డలి: జగన్‌పై ఉన్న ప్రధాన ముద్ర.. గత ఎన్నికల్లో ప్రచారంలోకి వచ్చింది బాబాయ్-గొడ్డలి. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య నేపథ్యంలో వైసీపీ వేసిన పిల్లిమొగ్గలే దీనికి దారితీశాయి. వైసీపీ అనుకూల మీడియాలో గుండెపోటుతో మరణించారని ప్రచారం చేయడం.. తర్వాత.. ఇది దారుణమని తేలడం జగన్‌కు తీవ్ర ఇబ్బందులు తెచ్చింది. ఆ తర్వాత.. అధికారంలో ఉండగా సీబీఐని వ్యతిరేకించడం కూడా.. కారణమైంది. దీంతో జగన్‌పై బాబాయి -గొడ్డలి ముద్ర పడింది.
కోడికత్తి: విపక్షంలో ఉన్నప్పుడు.. విశాఖలో కోడికత్తితో దాడి జరిగిన మాట వాస్తవమే. అయితే.. ఇది ప్రత్యర్థులు.. ముఖ్యంగా అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం జగన్ ప్రాణాలు తీసేలా చేసేందుకు ఇలా చేసిందంటూ.. నాడు వైసీపీ చేసిన ప్రచారం వికటించింది. ఫలితంగా ఇప్పటికీ.. కోడికత్తి కేసులో ఆ ముద్ర జగన్‌పై ఉంది. పైగా.. ఆయన సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు వెళ్లకుండా చేసిన తాత్సారం కూడా ఇబ్బంది పెట్టింది.
సైకో: అధికారంలో ఉన్నప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయాలు ఆయనపై సైకో అనే ముద్రవేసేలా చేశారు. మూడు రాజధానులు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సహా.. ఉత్తి పుణ్యాన చంద్రబాబును అరెస్టు చేయడం.. టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం.. చేసిన వారిని సమర్ధించడం.. శవం డోర్ డెలివరీ చేసిన నాయకుడిని కూడా సమర్థించడం.. వంటివి జగన్ మనస్తత్వానికి అద్దంపట్టేలా చేస్తున్నాయని.. అప్పట్లో టీడీపీ విరుచుకుపడింది. దీంతో ఆయనపై సైకో అనే ముద్ర పడింది.
ఇలా.. ఇవన్నీ చెరిగిపోకముందే.. తాజాగా.. మావిగన్-అవి గొడ్డలి ముద్ర రెడీ అయింది. అమరావతికి వ్యతిరేకంగా జగన్ చేసిన ప్రతిపాదన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచగా.. దీనికి షర్మిల వేసిన మసాలా మరింత ఘాటుగా మారింది. సో.. ఇప్పుడు మావిగన్.. ముద్ర జగన్పై పడింది. నిలకడలేని నాయకుడిగా ఆయనపై పడుతున్న ముద్ర విషయంలో ఇప్పటికైనా అప్రమత్తం కాకపోతే.. ఇబ్బందులు తప్పవని అంటున్నారు.