చంద్ర‌బాబుకు మోడీ, జ‌గ‌న్‌ల‌ విషెస్

admin
Published by Admin — April 20, 2026 in Andhra
News Image

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు(ap cm chandrababu)కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ(pm modi), వైసీపీ అధినేత జ‌గ‌న్‌(ycp chief jagan)లు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు(birth day wishes) తెలిపారు. వేర్వేరుగా ఎక్స్‌లో బాబుకు విషెస్ చెప్పారు. మోడీ త‌న శుభాకాంక్ష‌ల్లో.. చంద్ర‌బా బును ఆకాశానికి ఎత్తేశారు. క‌ష్టించి ప‌నిచేసే ముఖ్య‌మంత్రిగా ఆయ‌న‌ను కొనియాడారు. అంతేకాదు.. ఆప్త‌మిత్రుడు అంటూ.. ప్ర‌శంసించారు.

చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతోంద‌ని.. ప్ర‌ధాని పేర్కొన్నారు. కొత్త శిఖ‌రాల‌ను అధిరోహిస్తోంద‌న్నారు. చంద్ర‌బాబుకు.. సంపూర్ణ ఆరోగ్యం క‌ల‌గాల‌ని.. ఆయ‌న దీర్ఘాయుష్షుతో ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్టు మోడీ పేర్కొన్నారు.

ఇక‌, వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా చంద్ర‌బాబుకు విషెస్ చెప్పారు.  ``చంద్ర‌బాబు నిండు నూరేళ్లు.. ఆరో గ్యంతో ఉండాల‌ని కోరుకుంటున్నా`` అని జ‌గ‌న్ తెలిపారు. ఇక‌, గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు కూడా చంద్ర‌బాబుకు శుభాకాంక్ష‌లు తెలిపారు. విజన్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బృహత్తర బాధ్యత తీసుకున్నారని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రశంసించారు.

గ‌తానికి భిన్నంగా..

గ‌త రెండేళ్ల కింద‌టి వ‌ర‌కు వైసీపీ నాయ‌కులు, ఆ పార్టీ సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ సైతం చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం గుర్తుండే ఉంటుంది. ఏప్రిల్‌-20న జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని విప‌రీత అర్థం వ‌చ్చేలా దీనిని చిత్రీక‌రించారు. కాగా.. ఓట‌మి త‌ర్వాత‌.. వైసీపీ స‌హా.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ సైతం.. త‌న పంథా మార్చుకున్నారు. గ‌త ఏడాది కూడా సేమ్‌.. ఇలానే జ‌గ‌న్.. చంద్ర‌బాబుకు శుభాకాంక్ష‌లు తెలిపారు. 

Tags
cm chandrababu pm modi birth day wishes ap ex cm jagan
Recent Comments
Leave a Comment

Related News