విశాఖపట్నంలోని తర్లువాడలో ఏర్పాటు చేయనున్న గూగుల్(google) ఏఐ డేటా కేంద్రానికి మంగళవారం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సహా పలువురు భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. భూమి పూజతోనే ఈ డేటా కేంద్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. అత్యధికమంది నెటిజన్లు.. దీనిని లైక్ చేశారు. సోషల్ మీడియా ఎక్స్‌లో భారీ స్థాయిలో ట్రెండింగ్‌లో అంశంగా గూగుల్ ఏఐ డేటా కేంద్రం నిలిచింది.
ఎక్కువ మంది లైక్ చేయడంతోపాటు హ్యాష్ ట్యాగ్‌ను ఫార్వర్డ్ చేస్తున్నారు. #GoogleBreaksGroundInVizag ట్యాగ్‌కు విశేష స్పందన లభించింది. సోషల్ మీడియా ఎక్స్‌లో ఈ హ్యాష్‌టాగ్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. దీనిపై మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. దీనిని తాను ముందే ఊహించానని వ్యాఖ్యానించారు.
మంత్రి లోకేష్ దృష్టికి మీడియా ప్రతినిధులు ఈ విషయాన్ని చేరవేయగా.. తాను ముందుగానే ఊహించానని ఆయన చెప్పారు.
విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబుకు ఈ గౌరవం దక్కుతుందన్నారు. ఏపీ బ్రాండ్‌ను తిరిగి తీసుకువచ్చారని అన్నారు. విశాఖ వంటి పెద్ద నగరంలో గూగుల్ డేటా రావడం ద్వారా.. నగరానికి ప్రపంచ గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రపంచంలో ఎక్కడివారైనా.. దీనిని స్వాగతిస్తున్నారని తెలిపారు. త్వరలోనే పనులుకూడా ప్రారంభం అవుతున్నాయని.. అనుకున్నట్టుగా షెడ్యూల్ ప్రకారం పూర్తి అవుతుందని తెలిపారు.