బీజేపీకి అన్నామలై గుడ్ బై

admin
Published by Admin — June 02, 2026 in National
News Image

ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన త‌మిళ‌నాడులో టీవీకే పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్పుడు మ‌రో కొత్త పార్టీ తెర‌మీదికి వచ్చింది. బీజేపీ నాయ‌కుడిగా గుర్తింపు పొందిన మాజీ ఐపీఎస్‌ (వాలంట‌రీ రిటైర్మెంట్‌) అధికారి అన్నామ‌లై బీజేపీకి రాజీనామా చేశారు. ఈ ప్రకారం అధికారికంగా తన రాజీనామా లేఖను బీజేపీ హై కమాండ్ కు ఆయన పంపించారు. ఆయన మరో రెండు రోజుల్లో అన్నామ‌లైన అన్బు కూట్టం పేరుతో కొత్త‌ కుంప‌టి పెట్టుకుంటున్నారు. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌లో ఆయ‌న త‌న సొంత పార్టీపైనే పోటీ చేస్తార‌ని తెలుస్తోంది.

2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అన్నామ‌లై.. క‌ర్ణాట‌క‌లో 2017 చివ‌రి వ‌ర‌కు ప‌నిచేశారు. అప్ప‌ట్లోనే ఆయ‌న‌.. బ‌ల‌మైన ఐపీ ఎస్ అదికారిగా పేరు తెచ్చుకున్నారు. అవినీతి, అక్ర‌మాల‌పై ఉక్కుపాదం మోపార‌ని పేరు తెచ్చుకున్నారు. ఇలా.. ఆయ‌న బీజేపీ అగ్ర‌నేత‌, ప్ర‌స్తుత కేంద్ర హోం మంత్రి అమిత్‌షా క‌నుస‌న్నల్లో ప‌డ్డారు. ఆత‌ర్వాత .. జ‌రిగిన ప‌రిణామాల క్ర‌మంలో 2019లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. చిత్రం ఏంటంటే.. ఆయ‌నతో బీజేపీ నేత‌లు చ‌ర్చ‌లు పూర్తి చేసిన త‌ర్వాత‌.. ఆయ‌న ఐపీఎస్ ప‌ద‌వికి రాజీనామా చేసిన 4 గంట‌ల్లోనే కేంద్రం నుంచి అనుమ‌తి ల‌భించింది. వాస్త‌వానికి ఐపీఎస్‌, ఐఏఎస్‌లు రాజీనామా చేస్తే.. 48 గంట‌ల నుంచి వారం ప‌ది రోజుల పాటు వారు ఆలోచించుకునే అవ‌కాశం ఇస్తారు.

కానీ, అన్నామ‌లై విష‌యంలో హుటాహుటిన కేంద్రం అనుమ‌తి ఇచ్చి.. ఆయ‌న‌ను బీజేపీలోకి చేర్చుకుంది. తర్వాత‌.. త‌మిళ నాడు బీజేపీకి ఆయ‌నను చీఫ్‌గా నియ‌మించింది. ఇలా.. ప్రారంభ‌మైన రాజ‌కీయ ప్ర‌స్థానంలో అప్ప‌టి జ‌య‌ల‌లిత నుంచి ఇటీవ లి స్టాలిన్ ప్ర‌భుత్వాల వ‌ర‌కు కూడా.. అన్నామ‌లై.. అవినీతిని వెలికి తీశారు. మ‌ద్యం అక్ర‌మాల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చా రు. పార్టీ ప‌రంగా త‌మిళ‌నాడులో దూసుకుపోయే విధానాల‌ను యువ‌త‌ను ఆక‌ర్షించే విధానాల‌ను కూడా తీసుకువ‌చ్చారు. ఫ‌లితంగా బీజేపీ క్షేత్ర‌స్థాయిలో బ‌లంగా పుంజుకునే ప‌రిస్థితికి వ‌చ్చింది.

అయితే.. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీఎన్నిక‌ల స‌మ‌యంలో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. దీనికి ముందు అన్నామ‌లై త‌మ ప్ర‌భుత్వంలోని అవినీతిని బ‌య‌ట పెట్టార‌న్న అక్క‌సుతో ఉన్న అన్నాడీఎంకే కార్య‌ద‌ర్శి, మాజీ సీఎం ప‌ళ‌ని స్వామి.. ఆయ‌న ఉంటే.. తాము పొత్తు పెట్టుకునేది లేద‌ని తేల్చి చెప్పార‌ని ప్ర‌చారం జ‌రిగింది. దీనికి త‌గిన‌ట్టుగానే బీజేపీ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నాలుగు మాసాల స‌మ‌యంలో బీజేపీ చీఫ్ ప‌ద‌వి నుంచి అన్నామ‌లైని త‌ప్పించింది. ఎన్నిక‌ల వ్య‌వ‌హారాలు.. టికెట్ల కేటాయింపులోనూ ఆయ‌న‌కు ఎలాంటి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌లేదు. క‌నీసం.. త‌న వారికి రెండు సీట్లు కేటాయించాల‌ని కోరినా.. కేటాయించలేదు.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా అన్నామ‌లై బీజేపీకి రాజీనామా చేశారు. రెండ్రోజుల్లో సొంతపార్టీ ప్రకటించి పెరంబూరు నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌ల్లో అన్నామ‌లై పోటీ చేస్తార‌ని తెలుస్తోంది. కొత్త పార్టీ పేరు, విధివిధానాలపై ఆయన బుధ‌వారం ప్ర‌క‌ట‌న చేయొచ్చ‌ని ప్రచారం జరుగుతోంది.

Tags
annamalai quits bjp
Recent Comments
Leave a Comment

Related News