ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గం అత్యంత కీలకం. ఇతర నియోజకవర్గాల్లో ఉన్నట్టుగా ఇక్కడ రాజకీయాలు ఉండవు. చాలా భిన్నంగా సాగుతాయి. అలాంటి చోట.. గత ఎన్నికల్లో కొండయ్య టీడీపీ(TDP) తరఫున విజయం దక్కించుకున్నారు. మంచి గడసరి నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. అంతేనా .. వచ్చీ రావడంతోనే వైసీపీకి భారీ షాకిచ్చారు. చీరాల మునిసిపాలిటీని టీడీపీ పరం చేయడంలో కీలక చక్రమే తిప్పారు.
ఇక, నియోజకవర్గం సమస్యలపై తనదైన గళం కూడా వినిపిస్తున్నానని ఆయన చెబుతున్నారు. కానీ, లోక ల్ టాక్ మాత్రం భిన్నంగా ఉంది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ` కొండయ్య గారూ.. ఇది విన్నారా?` అంటూ.. కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు..ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఇంతకీవిషయం ఏంటంటే.. కొండయ్య(Kondaiah) గారి రాజకీయం దురుసే కాదు.. పెళుసు కూడా నట!. తన వద్దకు వచ్చే వారిని.. ఆయన చాలా గౌరవంగా అరెయ్.. ఒరెయ్ అని పిలుస్తున్నారన్నది పెద్ద టాక్!.
మీడియా ముందు కూడా ఆయన ఇలానే అరుపులు కేకలు పెట్టిన సంఘటలు.. గత ఆరుమాసాల కింద చూశాం. అప్పట్లో మంత్రి నారా లోకేష్(Nara Lokesh).. మర్యాద.. మర్యాద.. అంటూ కొంత క్లాస్ ఇచ్చారు. కానీ, కొండయ్య గారిలో పుట్టుకతో వచ్చిందో ఏమో.. ఈ విషయంలో మార్పు రాలేదు. దీంతో కొండయ్యగారిని కలవాలంటే.. ఒకింత మర్యాదస్తులు జంకుతున్నారన్నది టాక్. ఇక, రెండో విషయం.. అంతా నేనే అనే నాయకులు చాలా మంది ఉన్నారు. అంటే.. నియోజకవర్గంలో పెత్తనమన్నమాట.
కానీ,కొండయ్య స్టయిలే వేరని సోషల్ మీడియా గగ్గోలు పెడుతోంది. ఈయన ` అంతా నేనే` అన్నదానికి మరో లైన్ చేర్చి.. అంతా నాదే అంటూ.. చక్రం తిప్పేస్తున్నారట. దీంతో సొంత పార్టీ నేతలైనా.. కూట మి నాయకులైనా.. సమర్పించుకుంటే తప్ప.. ఏపనీ సవ్యంగా సాగడం లేదని పెద్ద ఎత్తున చెబుతున్నా రు. అయితే.. ఇవన్నీ.. వైసీపీ(YCP) నేతలు సృష్టిస్తున్న వ్యతిరేకతలో భాగమని కొండయ్య గారు చెబుతున్నా.. వాదిస్తున్నా.. జనాలు ఏమనుకుంటున్నారో.. వినాలని సోషల్ మీడియా జనాలు.. జనాల వాదనను పట్టి మరీ వినిపిస్తున్నారు. మరి కొండయ్యగారు వింటారో లేదో చూడాలి.