ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాల అమలుతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది వేసవి సెలవుల తర్వాత తల్లికి వందనం పథకం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం కూడా ఆ పథకం అమలుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. తాజాగా తల్లికి వందనం పథకాన్ని జులై మూడో వారంలో అమలు చేసేందుకు సిద్ధం కావాలని అధికారులను విద్యా శాఖా మంత్రి లోకేశ్ ఆదేశించారు.
పాఠశాల విద్య, ఉన్నత విద్యా శాఖ అధికారులకు పలు కీలక అంశాలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. తల్లికి వందనం పథకంలో తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని, జులై మూడో వారంలో పథకం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నామని లోకేశ్ కు అధికారులు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని లోకేశ్ అన్నారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు జూన్ 29న 'షైనింగ్ స్టార్స్' కార్యక్రమం, తల్లిదండ్రులను భాగస్వాములను చేసేందుకు జులై మూడో వారంలో 'మెగా పీటీఎం' నిర్వహించాలని నిర్ణయించారు.