సాయికృష్ణ కేసులో కీలక పరిణామం

admin
Published by Admin — June 21, 2026 in Politics
News Image

విజయవాడలోని కృష్ణలంకకు చెందిన యువకుడు గాదె సాయి కృష్ణ అదృశ్యం వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పోలీసుల కస్టడీలో సాయికృష్ణ మృతి చెందాడని, ఆ తర్వాత పోలీసులు అతడి శరీరాన్ని దహనం చేసి కనీసం బూడిద కూడా మిగల్చకుండా చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీఐగా పనిచేస్తున్న నాగరాజుపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సిట్ నియమించింది. ఈ సిట్ దర్యాప్తు బృందంలో పలు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు సభ్యులుగా ఉన్నారు. పోలీసులతోపాటు టెక్నికల్, ఫోరెన్సిక్ నుంచి  సహాయ సహకారాలు కూడా తీసుకునే విధంగా సిట్ కు పూర్తి స్థాయి అధికారులు కల్పించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగరాజు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం సీఐ నాగరాజుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. విచారణ తర్వాత నాగరాజును అరెస్టు చేసే అవకాశాలున్నాయి.

Tags
sit formed saikrishna's case ap cm chandrababu
Recent Comments
Leave a Comment

Related News