అక్కినేని అఖిల్ కెరీర్లో ఎంతో కీలకమైన సినిమా.. లెనిన్. అఖిల్‌తో పాటు నాగ్ చాలా జాగ్రత్తగా ఈ ప్రాజెక్టును ఎంచుకున్నారు. మేకింగ్ విషయంలోనూ ఎంతో శ్రద్ధ పెట్టారు. దీని కోసం అఖిల్ చాలా టైమే పెట్టాడు. ఐతే మే 1నే రావాల్సిన ఈ సినిమా ఒకటికి రెండుసార్లు వాయిదా పడింది. ముందేమో అఖిల్ ఫ్రెండు చరణ్ సినిమా పెద్ది కోసం వాయిదా అన్నారు. తర్వాతేమో క్వాలిటీ పేరు చెప్పి మళ్లీ జూన్ 26 నుంచి జులై 10కి ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. దీని మీద సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. మధ్యలో ఓటీటీ సంస్థ షరతుల గురించి కూడా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఐతే తెర వెనుక అసలేం జరిగింది.. ఎందుకు సినిమాను రెండుసార్లు వాయిదా వేయాల్సి వచ్చింది నాగ్ స్వయంగా లెనిన్ ప్రెస్ మీట్లో వివరించాడు. ఓటీటీ కోసమో.. ఇంకెవరి కోసమో సినిమా రిలీజ్ డేట్ మార్చడం అన్నది ఉండదని ఆయన స్పష్టం చేశాడు. సినిమా తీసింది తామని, తమకు నచ్చకుండా దాన్ని ప్రేక్షకుల ముందు పెట్టడం కరెక్ట్ కాదని.. అందుకే సినిమా ఆలస్యమైందని నాగ్ స్పష్టం చేశాడు. తాను ఎప్పుడూ పక్కా ప్లానింగ్‌తో ఉంటానని.. చెప్పిన రిలీజ్ డేట్‌కే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తానని.. కానీ లెనిన్ విషయంలో బెస్ట్ ఔట్ పుట్ తీసుకొచ్చేందుకు కొంచెం ఆలస్యం అయిందని నాగ్ చెప్పాడు.
బాగా తీసిన సినిమాను మరింత బెటర్ ఔట్‌పుట్‌తో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు తమకు మరి కొంత సమయం కావాలని తనను టీం అడిగిందని.. సినిమా బెటర్మెంట్ కోసం తాను అందుకు అంగీకరించానని.. పూర్తిగా సంతృప్తికరంగా సినిమా తయారయ్యాకే లెనిన్‌ను రిలీజ్ చేస్తున్నామని నాగ్ తెలిపాడు. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించిన లెనిన్ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రాన్ని రూపొందించాడు. నాగ్‌తో కలిసి నాగవంశీ ఈ మూవీని నిర్మించాడు.