ట్రిపుల్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా `కోర్ట్‌`.. 6 డేస్ క‌లెక్ష‌న్స్ ఇవే!

News Image

గ‌త వారం విడుద‌లైన చిత్రాల్లో `కోర్ట్‌` ఒక‌టి. న్యాచుర‌ల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా నిర్మించిన ఈ సినిమాకు రామ్ జగదీష్ ద‌ర్శ‌కుడు. హర్ష్‌ రోషన్, శ్రీదేవి, ప్రియ‌ద‌ర్శి, శివాజీ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. మార్చి 14న విడుద‌లైన కోర్టు.. గుడ్‌ కాన్సెప్ట్ తో సాగే డీసెంట్ డ్రామాగా ప్ర‌శంస‌లు అందుకుంది. టాక్ బాగుండ‌టంతో ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను అందుకుంటూ ట్రిపుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. వీకెండ్ లోనే కాకుండా వ‌ర్కింగ్ డేస్ లో మంచి హోల్డ్ ను క‌న‌బ‌రుస్తోంది. 6 డేస్ థియేట్రిక‌ల్ ర‌న్ ను పూర్తి చేసుకున్న కోర్ట్‌.. ఏపీ మ‌రియు తెలంగాణ‌లో ఏకంగా రూ. 12.45 కోట్ల షేర్‌, రూ. 11.32 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను సాధించింది. ఓవ‌ర్సీస్‌లో కూడా ఈ చిత్రానికి సూప‌ర్ రెస్పాన్స్ వ‌స్తోంది. అక్క‌డ ఇప్ప‌టివ‌ర‌కు రూ. 4.05 కోట్ల వ‌సూళ్లు వ‌చ్చాయి. అలాగే ఆరు రోజుల్లో వర‌ల్డ్ వైడ్ గా రూ. 17.90 కోట్ల షేర్‌, రూ. 33.80 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను కోర్టు మూవీ రాబ‌ట్టుకుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 7 కోట్ల రేంజ్‌లో ఉండ‌గా.. రెండు రోజుల‌కే కోర్ట్ టార్గెట్‌ను క్రాస్ చేసి లాభాల బాట ప‌ట్టింది. ఆరు రోజుల్లో రూ. 10.90 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఫుల్ ర‌న్ లో మ‌రిన్ని లాభాల‌ను గ‌డించే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

Related News