`ఇంటింటికీ కూటమి ప్రభుత్వం` పేరుతో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన కార్యక్రమంపై పార్టీ అధినేత, సీ ఎం చంద్రబాబు చాలానే ఆశలు పెట్టుకున్నారు. సుదీర్ఘంగా ఈ కార్యక్రమాన్ని 45 రోజుల పాటు నిర్వహిం చాలని కూడా నిర్ణయించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నాయకులకు పూర్తిస్థాయి బాధ్య తలను కూడా అప్పగించారు. మొత్తంగా ఈ కార్యక్రమంపైనే భారీ ఆశలు పెట్టుకున్నట్టు స్పష్టం చేశారు.
నాలుగు రీజన్లు..
ఇంటింటికీ కూటమి ప్రభుత్వం ద్వారా ప్రధానంగా నాలుగు అంశాలపై పార్టీ దృష్టి పెట్టింది. 1) కూటమి నాయకుల ఐక్యత: ప్రస్తుతం క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య ఐక్యత సన్నగిల్లుతోంది. దీనిని సరిచే యాల్సి ఉంది. తాజా కార్యక్రమం ద్వారా అందరినీ కలుపుకొని వెళ్లే దిశగా అడుగులు వేయాలని నిర్ణయిం చారు. దీనికి ఇంటింటికీ కార్యక్రమం దోహదపడాలని కూడా తేల్చి చెప్పారు. మూడు పార్టీల నాయకులు కలివిడిగా ప్రజలను కలుసుకోవాలని పేర్కొన్నారు.
2) కూటమి విజయాలు: కూటమి ప్రభుత్వం గతరెండేళ్ల కాలంలో చేసిన పనులు, సాధించిన విజయాల ను ప్రజలకు వివరించాలన్నది అత్యంత ముఖ్యమైన విషయం. పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగాల కల్పన వంటివాటిని ఇంటింటికీ చేరవేయాలని.. తద్వారా గ్రాఫ్ పెంచాలని భావిస్తున్నారు. 3) సంక్షేమం: ప్రస్తు తం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరిస్తారు. ప్రతి ఇంట్లో ఎంత మేరకు లబ్ధి చేకూరిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గణాంకాలతో సహా వివరించనున్నారు.
4) ప్రజల ఫీడ్ బ్యాక్: ఇప్పటి వరకు ఐవీఆర్ ఎస్ సహా.. ఇతర మాధ్యమాల ద్వారా మాత్రమే ప్రజల నుం చి అభిప్రాయాలు తీసుకున్నారు. కానీ, తాజాగా చేపట్టిన ఇంటింటికీ కార్యక్రమం ద్వారా.. నేరుగా ప్రజల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అభిప్రాయాలు తెలుసుకుంటారు. సంక్షేమం నుంచి పెట్టుబడుల వరకు అన్ని అంశాలపైనా.. ప్రజల నుంచి సమాచారం తీసుకుని.. దానికి అనుగుణంగా విధానపరమైన మార్పుల దిశగా ప్రభుత్వం అడుగులు వేయనుంది. ఇలా.. ఈ నాలుగు అంశాలను కీలకంగా భావిస్తున్నారు.