ప్ర‌భాస్ అయితే భ‌య‌ప‌డాలా.. విశ్వ‌క్ డేంజ‌ర్ స్టెప్‌.!

admin
Published by Admin — September 06, 2026 in Movies
News Image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సినిమా వస్తోందంటేనే టాలీవుడ్ వర్గాల్లో ఒకలాంటి టెన్షన్ ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద ఆయన మేనియా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ప్రభాస్ సినిమాకి కేవలం ఒక్క రోజు గ్యాప్‌లో బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఈ డేంజర్ స్టెప్ వెనుక అసలు స్టోరీ ఏంటో చూద్దాం.

విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లెగ‌స్సీ(Legacy)’ డిసెంబర్ 4న విడుదల కాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. డిసెంబర్ 3న ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఫౌజీ’ థియేటర్లలోకి రానుంది. ఈ డేట్‌ను చిత్రయూనిట్ ఎప్పుడో ఫిక్స్ చేసింది. ప్రభాస్ సినిమాకి ఉన్న క్రేజ్ రీత్యా.. ఆ సినిమా రిలీజైన రెండు వారాల పాటు చుట్టుపక్కల ఎలాంటి పెద్ద సినిమాలు రాకపోవడమే సేఫ్ అని ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. అలాంటిది ఒక రోజు ముందు, వెనుక అనే తేడా లేకుండా ప్రభాస్‌తో పోటీ పడేందుకు విశ్వక్ సాహసం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అసలు ప్రభాస్ రేంజ్ తెలిసి కూడా విశ్వక్ సేన్(Vishwak Sen) ఈ రిస్క్ ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అయితే దీని వెనుక మేకర్స్ చాలా పెద్ద వ్యూహామే వేసినట్లు తెలుస్తోంది. ‘ఫౌజీ’ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ, డిసెంబర్ 3 కల్లా సినిమా పనులన్నీ పూర్తి కాకపోతే డేట్ మారే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. ఒకవేళ అనుకున్న టైంకి ‘ఫౌజీ’ రాకపోతే డిసెంబర్ 4న సోలోగా బాక్సాఫీస్‌ను షాక్ ఇవ్వొచ్చనేది విశ్వక్ టీమ్ ప్లాన్‌గా కనిపిస్తోంది. ఒకవేళ ప్రభాస్ సినిమా అనుకున్న డేట్‌కే వస్తే మాత్రం విశ్వక్ తన రిలీజ్ డేట్‌ను మార్చుకోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ప్రభాస్ ముందు కర్చీఫ్ వేసి కూర్చున్న విశ్వక్ సేన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేక చివరికి వెనక్కి తగ్గుతుందా అనేది వేచి చూడాలి.

Tags
Vishwak Sen Prabhas Fauji Legacy Movie Tollywood Telugu Cinema Latest News
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News