వెంకటేష్‌ కోసం ఎన్టీఆర్‌.. త్రివిక్రమ్‌ బిగ్‌ స్కెచ్‌.!

admin
Published by Admin — September 08, 2026 in Movies
News Image

టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక క్రేజీ కాంబినేషన్ గురించిన చర్చ హాట్ టాపిక్‌గా మారింది. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం(Adarsha Kutumbam)’. అక్టోబర్ 2న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ డెడ్‌లైన్‌ను అందుకోవడం కోసం యూనిట్ ప్రస్తుతం అలుపెరగకుండా శ్రమిస్తోంది. అనుకున్న టైంకి సినిమా వస్తుందా లేదా అనే టెన్షన్ ఒకవైపు ఉంటే, ఈ మూవీకి సంబంధించి బయటకు వస్తున్న ఒక అదిరిపోయే న్యూస్ మాత్రం ఫ్యాన్స్‌లో అంచనాలను అమాంతం పెంచేస్తోంది.

త్రివిక్రమ్(Trivikram) సినిమాల్లో వాయిస్ ఓవర్లకు ఉండే ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ‘జల్సా’ చిత్రానికి సూపర్‌స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చి సినిమాపై క్యూరియాసిటీని తారాస్థాయికి చేర్చారు. ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’ విషయంలోనూ త్రివిక్రమ్ అదే ఫార్ములాను రిపీట్ చేయబోతున్నారట. అయితే ఈసారి ఆ వాయిస్ ఓవర్ కోసం టాలీవుడ్‌లో ఊహించని పేరు వినిపిస్తోంది. మరేదో కాదు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గొంతుతో ఈ సినిమా ప్రారంభం కానుందనే టాక్ ఫిల్మ్ నగర్‌లో గట్టిగా వినిపిస్తోంది.

త్రివిక్రమ్, ఎన్టీఆర్(NTR) కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత’ ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. అంతేకాదు, త్వరలో వీళ్లిద్దరి కలయికలో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కనుంది. మరోవైపు నిర్మాత నాగవంశీతో ఎన్టీఆర్‌కు ఉన్న సాన్నిహిత్యం, ఆయనపై ఉండే అభిమానం గురించి తెలిసిందే కదా. ఈ ముగ్గురి మధ్య ఉన్న బలమైన స్నేహం, సత్సంబంధాల కారణంగానే ఎన్టీఆర్ ఈ వాయిస్ ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ నిజంగానే సినిమాకు తారక్ వాయిస్ ఓవర్ యాడ్ అయితే, థియేటర్లలో ఆ హై బూస్టప్ వేరే లెవెల్‌లో ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags
Adarsha Kutumbam Venkatesh NTR Trivikram Srinivas Tollywood Telugu Cinema Latest News
Recent Comments
Leave a Comment

Related News