చిరంజీవి పేరుతో సొమ్ములు వ‌సూలు.. నిజమేనా..!

News Image

మెగాస్టార్ చిరంజీవి పేరుతో ర‌క్త‌దాన శిబిరాలు నిర్వ‌హించిన వారు ఉన్నారు. అన్న‌దానాలు చేసిన వారు ఉన్నారు. అంతేకాదు.. ఆయ‌న పేరు చెప్పి.. పేద‌ల‌కు సాయం అందించిన వారు కూడా ఉన్నారు. కానీ, 45 ఏళ్ల చిరు సినిమా చ‌రిత్ర‌లో.. తొలిసారి ఆయ‌న పేరు చెప్పి కోట్ల‌కు కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేశారా? ఆయ‌న ఫొటో పెట్టుకుని అభిమానుల నుంచి సొమ్ములు క‌లెక్ట్ చేశారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. స్వ‌యంగా చిరంజీవికి అందిన స‌మాచారం ప్ర‌కార‌మే రూ.20 కోట్ల‌కు పైగా నిధుల‌ను చిరు పేరు చెప్పి.. బ్రిట‌న్‌లో చిరు అభిమాన సంఘం వ‌సూలు చేసిన‌ట్టు తెలిసింది. దీనిపై చిరు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం.. ఇలా చేయ‌డం త‌గ‌ద‌ని ఆయ‌న సునిశితంగా మంద‌లించ‌డంగ‌మ‌నార్హం. అంతేకాదు.. తాజాగా సోష‌ల్ మీడియాలోనూ ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ.. సుదీర్ఘ పోస్టును పెట్టారు. బ్రిట‌న్‌లో త‌నను కలవాలని అభిమానులు చూపుతున్న ప్రేమ, ఆప్యాయత త‌న‌ను ఎంతగానో కదిలించింద‌న్నారు. కానీ, కొంతమంది వ్యక్తులు అభిమానుల సమావేశాలకు డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నా రని తెలిసి.. నివ్వెర పోయిన‌ట్టు చిరు వెల్ల‌డించారు. “ఈ ప్రవర్తనను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎవరై నా అలా వసూలు చేసి ఉంటే… ఆ మొత్తాన్బి వెంటనే తిరిగి ఇచ్చివేయండి. దయచేసి జాగ్రత్తగా ఉండం డి. నేను ఇటువంటి చర్యలకు ఎప్పుడు, ఎక్కడా మద్దతు ఇవ్వనని తెలుసుకోండి.“ అని చిరు వ్యాఖ్యానిం చారు. అంటే.. చిరునే స్వ‌యంగా చెప్పారంటే.. ఖ‌చ్చితంగా వ‌సూళ్ల ప‌ర్వం సాగింద‌న్న విష‌యం తెలుస్తోంది. ఇక‌, అక్క‌డితో కూడా చిరు ఆగ‌లేదు. “మనం పంచుకునే ప్రేమ మరియు ఆప్యాయతల బంధం అమూ ల్యమైనది. దీనిని ఎవరూ ఏ విధంగానూ వ్యాపార కోణంలో చూడలేరు.. మన అభిమాన బంధాన్ని స్వచ్ఛం గా ఎలాంటి దోపిడీకి గురికాకుండా ఉంచుకుందాం.“ అని వ్యాఖ్యానించారు. అంటే.. వ‌సూలు చేసిన వారు ఏ రేంజ్‌లో దోచుకున్నార‌న్న‌ది కూడా.. చిరు వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టిస్ప‌ష్టంగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారం..చిరు ఇమేజ్‌పై ప్ర‌భావం చూపుతున్న నేప‌థ్యంలో ఆయ‌నే స్వ‌యంగా స్పందించ‌డం గ‌మ‌నార్హం.

Related News