జగన్ కు షర్మిల చుట్టాల కౌంటర్!

admin
Published by Admin — October 24, 2026 in Andhra
News Image

బెంగుళూరులోని ఎలహంకలో ఏపీ మాజీ సీఎం జగన్, ఆయన సోదరి షర్మిలలకు ఉమ్మడి ప్రాపర్టీ ఉంది. ఒకే కాంపౌండ్ లో పక్కపక్కనే ఇద్దరి ఇళ్లు ఉన్నాయి. ఆ కాంపౌండ్ లో షర్మిల తన కూతురు అంజిలి పెళ్లి చేయాలని భావించారు. అయితే, అందుకు జగన్ ఒప్పుకోవడం లేదు. భద్రతా కారణాలు చెబుతూ అక్కడ పెళ్లి వేడుక వద్దంటున్నారు. ఈ క్రమంలోనే జగన్ పై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అంజిలి వివాహ ఆహ్వాన పత్రిక బయటకు వచ్చింది. అదే సమయంలో ఎలహంక ప్యాలెస్ ప్రాంగణంలో పెళ్లి వద్దని జగన్ రాసిన లేఖకు షర్మిల బంధువులు కౌంటర్ ఇచ్చారని తెలుస్తోంది.

 

అంజిలి వివాహ ఆహ్వాన పత్రికలో ఎలహంక ప్యాలెస్ ను వేదికగా ఆల్రెడీ ప్రింట్ చేయించారు షర్మిల. పెళ్లి కార్డులు కూడా పంచడం మొదలుబెట్టారు. తన బంధువులు, వియ్యంకుల బంధువులకూ పెళ్లి కార్డుల పంపిణీ చేశారు షర్మిల. ఇప్పుడు జగన్ మాత్రం అక్కడ పెళ్లి వద్దు అంటున్నారు. దీంతో,

ఉమ్మడి ఆస్తిలో పెళ్లి వేడుకుకు జగన్ అడ్డు పడడంపై షర్మిల బంధువులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

మేనమామగా ముందుండి పెళ్లి చేయాల్సిన జగన్ ఇలా మేనకోడలి పెళ్లికి ఆటంకాలు కల్పించడంపై వారు ఆగ్రహం చేస్తున్నారు. జగన్ భద్రతకు ఇబ్బంది అయితే రెండు రోజులు ఈ ప్యాలెస్ కు దూరంగా ఉండవచ్చు కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఫ్యాక్షన్ రాజకీయ పరిస్థితుల్లో కూడా కుటుంబ సభ్యుల పెళ్లిళ్లను వైఎస్ఆర్ తన ఇంట్లోనే చేశారని వారు గుర్తు చేస్తున్నారు.

 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే గొప్ప పోరాటాలు జగన్ చేశారా? వైఎస్ కంటే ఎక్కువ ప్రాణహాని జగన్ కు ఉందా అని నిలదీస్తున్నారు. అంతెందుకు తన శత్రువులను సైతం వైఎస్ ఆర్ పెళ్లిళ్లకు ఆహ్వానాలు పంపలేదా? అని ప్రశ్నిస్తున్నారు. వెడ్డింగ్ కార్డులో షర్మిల రెసిడెన్సీ, బెంగళూరు లో వివాహం షర్మిల వియ్యంకులు కార్డులు ప్రింట్ చేసిన విషయం జగన్ కు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. సెక్యూరిటీ పేరుతో కాబోయే వియ్యంకుల ముందు షర్మిల పరువు తీయాలని చూడటం ఎంతవరకు సమంజసం అని జగన్ ఆలోచించుకోవాలని వారు అంటున్నారు.

News Image
News Image
News Image
Tags
Sharmila jagan sharmila's relatives counter marriage
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News