ఎన్నికలొస్తే చాలు.. గర్జనలు, హెచ్చరికలు, “చొక్కా మడతేస్తా.. రండి చూద్దాం” అంటూ కాలు దువ్వడం వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కొత్తేం కాదు. కానీ, కెమెరాల ముందు గంభీరంగా డైలాగులు చెప్పడానికి, గ్రౌండ్‌లో రియాలిటీని ఫేస్ చేయడానికి మధ్య ఉండే గ్యాప్ ఎంత ఉంటుందో పులివెందుల మున్సిపల్ పోలింగ్ మరోసారి నిరూపించింది. సీన్ కట్ చేస్తే.. పోలింగ్ రోజున ఆయన చేసిన హడావుడి చూసి రాజకీయ పరిశీలకులే కాదు, సామాన్య జనం కూడా నవ్వుకుంటున్నారు.
ఉదయాన్నే పులివెందుల(Pulivendula)లో మొదలైన హైడ్రామా అంతా ఒక పర్ఫెక్ట్ సినిమా స్క్రిప్ట్‌లా అనిపిస్తుంది. సొంత నియోజకవర్గంలోనే ఓ వైఎస్సార్‌సీపీ నేత ఇంటి దగ్గర వాహనాలు తగలబడటం, దాన్ని వెంటనే ప్రత్యర్థుల ఖాతాలో వేయడానికి ప్రయత్నించడం స్క్రీన్‌ప్లే మొదటి సీన్‌లా సాగింది. ఇక అధికారులకు ముందే ఎలాంటి షెడ్యూల్ ఇవ్వకుండా సడన్‌గా ఎంట్రీ ఇవ్వడం, “మా హెలికాప్టర్‌కు ల్యాండింగ్ పర్మిషన్ ఇవ్వట్లేదు” అంటూ గాల్లోనే చక్కర్లు కొట్టి ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంటూ పెద్ద బిల్డప్ ఇవ్వడం చూస్తే.. మాజీ సీఎం రేంజ్ ఇది కాదంటూ సెటైర్లు పేలుతున్నాయి.
అక్కడితో ఆగిందా అంటే లేదు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏజెంట్లను కూర్చోనివ్వడం లేదంటూ రోడ్డెక్కిన జగన్(Jagan).. ఆర్వో ఆఫీస్ ముందు ధర్నాకు దిగి విసిరిన డైలాగ్ హైలైట్. “నేను ఒక్క పిలుపునిస్తే ఎన్నికలే ఆగిపోతాయి.. కానీ ఇవ్వను” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు నెట్టింట గట్టిగానే ట్రోల్స్ నడుస్తున్నాయి. ఎన్నికలను ఆపేయగల సత్తా ఉన్న నేత అనుకున్నారేమో.. చివరికి తన సొంత పులివెందుల మున్సిపాలిటీలో కనీసం ఓటు కూడా వేయకుండానే వెనుదిరిగిపోవాల్సి వచ్చింది. "రీపోలింగ్ పెడితేనే మళ్లీ వస్తా.. ఓటు వేస్తా" అంటూ ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ చూసి.. ఓటమి భయం, నైరాశ్యం ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టంగా అర్థమైపోతోందిని విశ్లేషకులు అంటున్నారు.
మొత్తానికి చూస్తే.. ఎన్నికల యుద్ధంలో ముందుండి నడిపించాల్సిన నాయకుడే ఇలా పోలింగ్ రోజున ధర్నాలు, రీపోలింగ్ డిమాండ్లంటూ పరుగుపెట్టడం వైఎస్సార్‌సీపీ(YSRCP) శ్రేణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రగల్భాలు పలికిన నోరు.. ఓటు వేసేందుకు మాత్రం నో చెప్పడంతో.. పులివెందుల పాలిటిక్స్‌లో ఇప్పుడు ఈసారైనా 'జగన్ మార్క్' డ్రామా పండిందా లేక నవ్వులపాలైందా అనే చర్చ జోరుగా సాగుతోంది.