వారసత్వ రాజకీయాలకు చెక్ : సాయి రెడ్డి

admin
Published by Admin — November 11, 2026 in Andhra
News Image

రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వేణుంబాకం విజ‌య‌సాయిరెడ్డి త‌న కొత్త పార్టీ పేరును ప్ర‌క‌టించారు. విజ‌య‌వాడ‌లోని ఎన్ క‌న్వెన్ష‌న్ వేదికగా నిర్వ‌హించిన భారీకార్య‌క్ర‌మంలో ఆయ‌న త‌న పార్టీ పేరును వెల్ల‌డించారు. `ప‌రివ‌ర్త‌న రాజ‌నీతి పార్టీ`గా పేర్కొన్నారు. షార్ట్ క‌ట్‌లో పీఆర్‌పీగా వెల్ల‌డించారు. ఇక‌, జెండా విష‌యానికి వ‌స్తే.. కాషాయం, తెలుపు రంగుతో కూడి జెండాను ప్ర‌క‌టించారు. దీనిలో అశోక చ‌క్రం మాదిరిగా.. ధ‌ర్మ చక్రం ఉంది. కానీ.. ఇది రౌండ్‌గానే ఉన్నా.. నాలుగు మూలల ఉబ్బెత్తుగా ఉన్న చ‌క్రాన్ని.. ఒక‌రంగా శ్రీవారం చ‌క్రం మాదిరిగా ఉంది.

కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయాల్లో `ప‌రివ‌ర్త‌న‌` పేరుతో తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఏర్పాటు కాలేదు. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వారు కూడా.. ఆ పార్టీ పేరును త‌మ పార్టీల్లో త‌గిలించుకున్నారు. ఉదాహ ర‌ణ‌కు `వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.` కానీ, ఆ వాస‌న‌లులేకుండానే సాయిరెడ్డి జాగ్ర‌త్తలు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌ధ్య‌లో ఏర్పాటు చేసుకున్న చ‌క్రంలోనూ కాషాయ రంగులు క‌నిపించాయి. అదేవిధంగా పేరులోనూ `రాజ‌నీతి` అనే పేరును పేర్కొన్నారు.

ఇది.. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ఉన్న పార్టీల‌ను పోలి ఉంటుంద‌న్న వాద‌న ఉంది. పార్టీ జెండాలోనూ.. 65 శాతం కాషాయం ఉండ‌గా.. కేవ‌లం 35 శాతం మాత్ర‌మే తెలుగు రంగు జెండా ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో సాయిరెడ్డి ఉద్దేశం ఏంట‌నేది ఆసక్తిగా మారింది. అదే స‌మ‌యంలో `పీఆర్‌పీ` అని పేర్కొన‌డం ద్వారా.. గ‌తంలో చిరంజీవి ప్రారంభించిన ప్ర‌జారాజ్యం పార్టీ(పీఆర్‌పీ)పేరును త‌ల‌పించింది. ఈ పేరుకు ప్ర‌జ‌ల్లో మంచి హ‌వా ఉంది. `పీఆర్‌పీ` షార్ట్ క‌ట్ ఫామ్ అంద‌రికీ తెలిసిందే. కేవ‌లం పేరు మాత్ర‌మే మారింది. సో.. త‌న పార్టీని ప్ర‌జ‌లు త్వ‌ర‌గా రిసీవ్ చేసుకునేందుకు వీలుగా సాయిరెడ్డి ఇలా ఎంచుకుని ఉంటార‌న్న చ‌ర్చ ఉంది.

స‌మ‌యం త‌ప్పింది..

వాస్త‌వానికి సాయిరెడ్డి త‌న పార్టీని 11వ తారీకు 11గంట‌ల‌.. 11 నిమిషాల‌కు ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. కానీ, చివ‌ర‌కు .. పార్టీ ప్ర‌క‌ట‌న చేసే స‌రికి.. 11 గంట‌ల 21 నిమిషాల‌.. 21 సెక‌న్ల స‌మ‌యం అయింది. దీనికి పూజ‌లు చేశారు. అలానే.. వేదిక‌పై దేశాధినాయ‌కుల చిత్ర‌ప‌టాలు ఉంచి నివాళులు స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా స్వ‌ల్ప నిడివి ఉన్న సాయిరెడ్డి జీవిత చరిత్ర ఏవీని ప్ర‌ద‌ర్శించారు. 

 

Tags
Sai Reddy comments on nepotism in politics
Recent Comments
Leave a Comment

Related News