జ‌గ‌న్‌ కు ఇర‌కాటం.. సాక్షి దెబ్బ రెడీ ..!

admin
Published by Admin — February 26, 2025 in Politics, Andhra
News Image

వైసీపీ అధినేత జ‌గ‌న్‌ కు మ‌రో ఇర‌కాటం ఎదురైంది. ఆయ‌న సొంత మీడియా సాక్షిపై అసెంబ్లీ స‌భాహ‌క్కు ల ఉల్లంఘ‌న కింద నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయింది. ఇదేమీ చిన్న విష‌యం కాదు. పైగా.. ఏపీలో ఇదే తొలిసారి కూడా. దీంతో మీడియా వ‌ర్గాల‌లో ఈ విష‌యంపై జోరుగానే చ‌ర్చ సాగుతోంది. స‌హ‌జంగా ప‌త్రిక‌ల్లో వ‌స్తున్న క‌థ‌నాల‌పై .. ఎవ‌రికి వారు విశ్లేష‌ణ‌లు చేసుకుంటారు. గ‌తంలోనూ.. ఇప్పుడు కూడా.. ప‌త్రిక‌లు రెండుగా చీలిపోయి.. ఎవ‌రికి న‌చ్చిన పార్టీకి వారు మ‌ద్ద‌తు ఇస్తున్నారు.

ఇది కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న‌దే. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 21(బీ) కింద ప‌త్రికా స్వేఛ్చ కొన‌సాగుతోంది. ఒక్క రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద‌వుల విష‌యంలో మాత్ర‌మే కొంత మిన‌హాయింపు ఉన్న‌ప్ప‌టికీ.. మిగిలిన వాటిలో ప‌త్రిక‌లకు స్వేచ్ఛ ఉంది. దీని కార‌ణంగానే సాక్షి ఆవిర్భ‌వించింది. ఆ రెండు ప‌త్రిక‌లు మ‌మ్మ ల్ని బ‌ద్నాం చేస్తున్నాయ‌ని.. ఆల్ట‌ర్నేట్ ప‌త్రిక రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఉమ్మ‌డి ఏపీలో రాజ‌శేఖ ర్రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు చేసిన వ్యాఖ్య‌ల అనంత‌రం.. సాక్షి ఆవిర్భ‌వించింది.

ఆ త‌ర్వాత‌.. ఎవ‌రికి వారు రాజ‌కీయాల‌ను స‌మ‌ర్తించుకుంటూనే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఎప్పుడూ ఇలా ప్ర‌విలేజ్ మోష‌న్ ఇచ్చిన ప‌రిస్థితి లేదు. గ‌తంలో వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు కొన్ని ప‌త్రిక‌లు వ్య‌వ‌హ‌రించిన తీరుకూడా.. వివాదం అయింది. అప్ప‌టి స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం కూడా.. ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ, ఎవ‌రూ ప్రివిలేజ్ జోలికి పోలేదు. కానీ, ఈ ద‌ఫా నేరుగా సాక్షి రాసిన క‌థ‌నం స‌భ‌పై అవినీతి ఆరోప‌ణ‌లు చేసిన‌ట్టుగా ఉంద‌న్న‌ది ప్ర‌స్తుత‌ స్పీక‌ర్ అయ్య‌న్న పాత్ర‌డు చెబుతున్న మాట‌.

స‌భ్యుల‌కు శిక్షణ ఇవ్వ‌కుండానే కోట్లాది రూపాయ‌లు మింగేశార‌న్న వ్యాఖ్య‌లే ఇప్పుడు సాక్షికి ఇబ్బందిగా మారాయి. దీనిపైనే స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న కింద నోటీసులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. తొలుత దీనిని క‌మిటికి రిఫ‌ర్ చేయ‌నున్నారు. అనంత‌రం.. చ‌ర్య‌లు తీసుకుంటారు. స‌హ‌జంగానే ఇలాంటి సంద‌ర్బాల్లో క‌మిటీ.. స‌భ‌కు అనుకూలంగా నే నివేదిక ఇస్తుంది. కాబ‌ట్టి.. సాక్షి త‌ర‌ఫున ఎడిట‌ర్‌.. స‌భ‌కు వ‌చ్చి స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతుంది. ఇది వైసీపీకి, జ‌గ‌న్‌కు కూడా ఇబ్బందేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags
Andhra Pradesh AP News ap politics
Recent Comments
Leave a Comment

Related News

Latest News