`మజాకా` రివ్యూ.. సందీప్ కిష‌న్ హిట్ కొట్టాడా?

admin
Published by Admin — February 26, 2025 in Movies
News Image

మ‌హాశివ‌రాత్రి కానుక‌గా నేడు తెలుగులో విడుద‌లైన కామెడీ ఎంటర్‌టైనర్ `మజాకా`. త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ స్టార్ సందీప్ కిష‌న్‌, సీనియ‌ర్ న‌టుడు రావు ర‌మేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. రీతు వర్మ, అన్షు హీరోయిన్లుగా న‌టించ‌గా.. లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. భారీ అంచ‌నాల న‌డుమ నేడు మ‌జాకా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే ప్రీమియర్ షోలు చూసిన ఆడియెన్స్ ఎక్స్‌(ట్విట్ట‌ర్‌) వేదికిగా రివ్యూలు ఇచ్చేస్తున్నారు.

మెజారిటీ పీపుల్ నుంచి మ‌జాకా మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. తండ్రీకొడుకులుగా సందీప్ కిష‌న్‌, రావు ర‌మేష్ క‌నిపించిన తీరు, వారి ఎన‌ర్జిటిక్ యాక్టింగ్, కామెడీ టైమింగ్ ఆక‌ట్టుకున్నాయ‌ని అంటున్నారు. ఫ‌స్టాఫ్ లో ల‌వ్ లెట‌ర్ సీన్‌, ప్రీ ఇంట‌ర్వెల్ మ‌రియు ఇంట‌ర్వెల్ సీన్స్ హైలెట్‌గా నిలిచాయ‌ని.. సెకండాఫ్ లో ప‌వ‌ర్ స్టార్ రిఫ‌రెన్స్‌, ప‌ట్టీలు సీన్‌, ఎమోష‌న్స్ బాగా వ‌ర్కోట్ అయ్యాయ‌ని చెబుతున్నారు.

సందీప్ కిషన్ రీతు వర్మ వెంటప‌డ‌టం.. మ‌రోవైపు అత‌ని తండ్రి రావు రమేష్ అన్షు వెంటపడడం.. ఈ క్ర‌మంలో వ‌చ్చే కామెడీ సీన్స్ క‌డుపుబ్బా న‌వ్విస్తాయ‌ని తెలుస్తోంది. స్టోరీ రొటీన్‌గా ఉన్నా సినిమా ఫుల్ ఫ‌న్‌ గా ఉంద‌ని.. కామెడీ బాగా వ‌ర్కోట్ అయింద‌ని.. సందీప్ కిష‌న్ హిట్ కొట్టాశాడ‌ని ప్రేక్ష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. చాలా కాలం త‌ర్వాత సిల్వ‌ర్ స్క్రీన్ పై క‌నిపించిన అన్షు యాక్టింగ్ అద‌ర‌గొట్టింద‌ని.. మజాకా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెబుతున్నారు. కొన్ని నెగ‌టివ్ రివ్యూలు కూడా వ‌స్తున్న‌ప్ప‌టికీ.. మ‌జాకా ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచ‌డం మాత్రం ప‌క్కా అంటున్నారు.

కాగా, మ‌జాకా చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ క‌థ‌, మాట‌లు అందించారు. ముర‌ళీ శ‌ర్మ‌, ర‌ఘుబాబు, హైప‌ర్ ఆది, శ్రీ‌నివాస‌రెడ్డి త‌దిత‌రులు ఈ చిత్రంలో ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించ‌గా.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా మ‌జాకా చిత్రాన్ని నిర్మించారు. `ఊరు పేరు భైరవకోన` వంటి హిట్ మూవీ అనంత‌రం సందీప్ నుంచి వ‌చ్చిన‌ చిత్ర‌మిది. మ‌రి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మజాకా సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎటువంటి వ‌సూళ్ల‌ను రాబ‌డుతుందో చూడాలి.

Tags
Anshu Latest news Mazaka Movie
Recent Comments
Leave a Comment

Related News

Latest News