కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ , టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ స్క్రీన్‌పై తండ్రీకొడుకులుగా నటిస్తే ఎలా ఉంటుంది.. బాబాయ్ ఆ ఊహే నెక్స్ట్ లెవల్. అటువంటి ఆలోచనే చేశాడో దర్శకుడు. బలమైన ఎమోషన్స్ తో మంచి ఫ్యామిలీ స్టోరీని రెడీ చేసి రజనీకాంత్, మహేష్ బాబులను సినిమాకు కూడా ఒప్పించాడు. కానీ ఆఖరి నిమిషయంలో తలైవార్ సినిమా నుంచి తప్పుకున్నారు. రజనీకాంత్ తండ్రిగా, మహేష్ కొడుకుగా మిస్ అయిన సినిమా మరేదో కాదు `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`.
శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు కాంబోలో వచ్చిన మల్టీస్టారర్ మూవీ ఇది. సమంత, అంజలి, ప్రకాశ్ రాజ్, జయసుధ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. పల్లెటూరులో బ్యాక్‌డ్రాప్ లో రేలంగి మావయ్య కుటుంబం చుట్టూ తిరిగే అందమైన అద్భుతమైన కథే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. 2013 లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.
పెద్దోడు, చిన్నోడు పాత్రల్లో వెంకీ, మహేష్ అదరగొట్టేయగా.. కథలో కీలకమైన రేలంగి మావయ్య ప్రకాష్ రాజ్ ప్రాణం పోశారు. అయితే రేలంగి మావయ్య పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా? సూపర్ స్టార్ రజనీకాంత్. అవును, మీరు విన్నది నిజమే.. వెంకటేష్, మహేష్‌ల తండ్రి పాత్రకు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తలైవార్ ను సంప్రదించారట. రజనీకాంత్ ను కలిసి కథ కూడా చెప్పారు. స్టోరీ నచ్చడంలో రజనీ తండ్రి పాత్ర చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. కానీ షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో రజనీకాంత్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ నుంచి తప్పుకున్నారు.