‘హిట్-3’ సంగీత దర్శకుడు హర్టు

admin
Published by Admin — May 04, 2025 in Movies
News Image

హిట్ ఫ్రాంఛైజీలో మూడో సినిమా వచ్చేసింది. కంటెంట్ పరంగా భారీ అంచనాలను అందుకోకపోయినా.. వసూళ్లకు మాత్రం ఢోకా లేదు. తొలి వీకెండ్లో భారీ ఓపెనింగ్స్‌తో సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేస్తోంది. దీంతో హిట్-4 ఉంటుందా లేదా అని సందేహాలు పెట్టుకోవాల్సిన పని లేదేమో. ‘హిట్-2’ చివర్లో ‘హిట్-3’కు లీడ్ ఇచ్చినట్లే.. ‘హిట్-3’ క్లైమాక్సు‌లో ‘హిట్-4’ గురించి హింట్ ఇచ్చేశాడు దర్శకుడు శైలేష్ కొలను. ‘హిట్: ఫోర్త్ కేస్’లో కార్తి హీరోగా నటిస్తాడని ముందు జరిగిన ప్రచారం నిజమైంది. ఆఖర్లో అదిరిపోయే క్యామియోతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు కార్తి. అతడి మీద తీసిన సీన్ చూశాక ‘హిట్-4’ మీద అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి.

ఐతే ఈ చిత్రంలో కార్తి పాత్ర ఎలా ఉంటుంది.. ఈ కథ ఎలా నడుస్తుందనే విషయంలో ప్రేక్షకుల్లో అమితాసక్తి ఉంది. ‘హిట్-3’ కథ విషయంలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈసారి శైలేష్ ఎలాంటి కసరత్తు చేస్తాడన్నది కూడా ఆసక్తికరం. ‘హిట్-3’ ప్రమోషన్లలో భాగంగా ‘హిట్-4’ గురించి దర్శకుడు శైలేష్ మాట్లాడాడు. ఆ సినిమా కథకు సంబంధించి జస్ట్ ఒక ఐడియా, హీరో పాత్ర చిత్రణ గురించి కొన్ని అంశాలు మాత్రమే అనుకున్నానని.. ఇంకా స్క్రిప్టు రెడీ కాలేదని అతను వెల్లడించాడు. హీరో పాత్ర, బేసిక్ స్టోరీ ఐడియా గురించి చెప్పగానే కార్తి ఒప్పుకుని ‘హిట్-3’లో క్యామియో చేసినట్లు అతను తెలిపాడు. ‘‘హిట్-4 కథ ఎలా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేను.

కాకపోతే కార్తి గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందన్నది ఒక స్పష్టత ఉంది. ఆ పాత్రకు క్రికెట్ అంటే ఇష్టం. బెట్టింగ్స్ వేస్తుంటాడు. ఆ క్యారెక్టర్ కొంచెం రూటెడ్‌గా, కొంత ఫన్ టచ్‌తో ఉంటుంది. ఆ పాత్ర ఎలా ఉంటుందో హిట్-3లో క్లుప్తంగా చూపించాం. నేను కార్తికి పూర్తి కథేమీ చెప్పలేదు. లైన్ ఏంటి.. పాత్ర ఎలా ఉంటుంది అన్నది మాత్రమే చెప్పాను. ఆయన ఆ ఐడియాను, నానిని నమ్మి రంగంలోకి దిగిపోయారు’’ అని శైలేష్ తెలిపాడు. మొత్తానికి కార్తి రాకతో ‘హిట్’ సిరీస్‌లో హీరో పాత్ర ఇప్పటి వరకు ఉన్నట్లు సీరియస్‌గా ఉండబోదని, కార్తి శైలికి తగ్గట్లు సరదాగా సాగుతుందని అర్థమవుతోంది. క్రికెట్ బెట్టింగ్స్ వేసే పోలీస్ పాత్ర అంటే వెరైటీ అనే చెప్పాలి.

Tags
Director Sailesh Kolanu Hit-4 Karthi kollywood
Recent Comments
Leave a Comment

Related News