మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?

admin
Published by Admin — May 18, 2025 in Andhra
News Image

నాటి & నేటి ప్రధాని మోదీ – నేటి మంత్రి – నాటి ముఖ్యమంత్రి…రెండు ఫోటోలు చూసి పుష్పా సినిమాలో షెకావత్ లెక్కన కొంత తగ్గింది అని గులకరాయి గుండె ఎంత మండిపోతోందో! మండదా మరి. సీఎంగా వెళితే తనకు దక్కనిది, మంత్రికి దక్కింది అని.

కామెడీ అలా వుంచితే.. 2 గంటలకు పైగా.. ఒక రాష్ట్ర మంత్రితో ప్రధాని సమావేశం అవ్వడం మాత్రం “సాధారణ విషయం” కాదని లిక్కర్ డాన్ గుండె డబ్ డబ్ అని మోగుతుంటుంది.
గవర్నర్ పర్మిషన్ నుండి ఏమేమి మాట్లాడుకొన్నారో అని యాలహంకా ప్యాలెస్లో మూతికాలిన పిల్లి లెక్కన ఎంత భీభత్సం చేస్తున్నాడో!

ఆ విషయం ప్రక్కనబెడితే.. రాజకీయాల నుండి అభివృద్ధి వరకు అన్నీ చర్చకు వచ్చి వుంటాయి. ప్రత్యేక పెట్టుబడులు, పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రం పట్ల శాశ్వత భరోసా మరియు నమ్మ్మకం కల్పించడానికి చేపట్టాల్సిన చర్యలు, “దశాబ్దానికి  పైగా పెండింగు”లో వున్న “రాష్ట్రానికి ఉపయోగపడే రాజకీయ అంశాలు” అన్నీ చర్చించుకొనే వుంటారు అని రాజకీయ విశ్లేషకుల అంచనా.

గ్లోబల్ టెక్ దిగ్గజ కంపెనీల నుండి ఆర్థిక రాజధాని ముంబై బిజినెస్ టైకూన్స్ వరకు లోకేశ్ తన సింప్లిసిటీ, గౌరవ మర్యాదలతో ఆకట్టుకుంటూ, చొరవ తీసుకొంటున్న విధానం, వేగంగా వారి సమస్యలను తీర్చుతూ.. ఈ విషయంలో నాయుడి కంటే భిన్నంగా.. తన దైన స్టైల్ లో దూసుకుపోతున్న పనితీరును ప్రజలు నిశితంగా  గమనిస్తున్నారు.

ఆంధ్రా పట్ల ప్రేమతో దూరదృష్టితో చూసి భయపడకుండా ఒక భరోసాగా.. తనను తాను మలచుకొన్న లోకేశ్ కష్టం చూసి, గతంలో ఎగతాళి చేసిన వారు సైతం, ఆయన పనితీరును బాహాటంగానే ప్రశంసిస్తున్నారు. ఆంధ్రా అభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధత, ఆయనకు గౌరవాన్ని తెచ్చిపెడుతోంది. ఇది చూసి, రాజకీయ ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

#చాకిరేవు

Tags
ex cm jagan minister lokesh pm modi respect from modi
Recent Comments
Leave a Comment

Related News