ప‌వ‌న్ పాలిటిక్స్‌... కవిత కామెంట్స్

News Image
Views Views
Shares 0 Shares

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై.. బీఆర్ ఎస్ నాయ‌కురాలు, తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ క‌విత ఆశ్చ‌ర్య‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఓ ప్యాడ్ కాస్ట్‌లో ఆమె మాట్లాడుతూ.. ప‌వ‌న్ అనుకోకుండా.. రాజకీయాల్లోకి వ‌చ్చార‌ని.. అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యార‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఆయ‌న పార్ట్ టైమ్ పొలిటీషియ‌న్ అని కూడా అన్నారు. అయితే.. ఈ విష‌యం ఏపీలో పెద్ద‌గా చ‌ర్చ‌కు రాలేదు. దీనిని ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

దీనికి కార‌ణం.. అదే రోజు.. వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌తీమ‌ణిపై చేబ్రోలు కిర‌ణ్ చేసిన వ్యాఖ్య‌లు. ఈ వ్యాఖ్య లు రాజ‌కీయ దుమారం రేప‌డంతో క‌విత చేసిన వ్యాఖ్య‌లపై పెద్ద‌గా చ‌ర్చ లేకుండా పోయింది. అయితే.. ఆమె చెప్పిన దానిలో వాస్త‌వం ఉందా? అనేది మాత్రం  విశ్లేష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది. నిజానికి ప‌వ‌న్ పార్ట్ టైమ్ పొలిటీషియ‌న్ అయితే.. ఇంత పెద్ద రేంజ‌లో ఆయ‌న‌కు వంద శాతం సీట్ల‌లో విజ‌యం ద‌క్కి ఉండేది కాదు. అదేస‌మ‌యంలో ఇంత పెద్ద ఎత్తున ఆయ‌న విజ‌యండ కూడా సాధ్య‌మ‌య్యేది కాదు.

సో.. ఎవ‌రు ఏమ‌నుకున్నా.. ప్ర‌జ‌లు మాత్రం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను పార్ట్ టైమ్ పొలిటీషియ‌న్ అనిచూడ‌లేదు. పైగా స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తున్న తీరు కూడా.. ప‌వ‌న్‌కు మార్కులు ప‌డేలా చేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా ఎన్నిక‌ల‌కు ప్రారంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న సినిమాల జోలికి పోకుండా.. పూర్తిస్థాయిలో రాజకీ యాలు చేస్తున్నారు. పైగా.. స‌నాత‌న ధ‌ర్మం పేరిట ఆయ‌న చేసిన ఉద్య‌మం.. దీక్ష వంటివి కూడా ఆయ‌న‌ను పార్ట్ టైమ్ రాజ‌కీయాలు చేస్తున్నార‌న్న వాద‌న‌ను కొట్టిపారేశాయి.

అంతేకాదు.. డిప్యూటీ సీఎంగా ఉండి.. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. గ్రామీణ ఆంధ్ర ప్ర‌దే శ్‌పై ప‌ట్టుసాధిస్తున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ అభివృద్ధి మంత్రం ప‌ఠిస్తున్నారు. ర‌హ‌దారుల నిర్మాణం.. నుంచి గ్రామీణ స్తాయిలో గోశాల‌ల నిర్మాణం వ‌ర‌కు... కూడా.. ప‌వ‌న్ చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. రాజకీయంగా కూడా.. ఎక్క‌డ త‌గ్గాలో అక్క‌డ త‌గ్గుతున్నారు. ఎక్క‌డ నెగ్గాలో అక్క‌డ నెగ్గుతున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ప‌వ‌న్ పార్ట్ టైమ్ అని కానీ.. ఆయ‌న అనుకోకుండా.. డిప్యూటీ సీఎం అయ్యార‌ని కానీ.. చెప్ప‌డానికి వీల్లేద‌ని.. క‌విత కేవ‌లం ఏదో రాజ‌కీయ వ్యూహంతోనే ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Recent Comments
Leave a Comment

Related News