జీవితాన్ని మార్చగల శక్తి చదువుకు మాత్రమే ఉంది: తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే తల్లికి వందనం పథకం

admin
Published by Admin — June 14, 2025 in Andhra
News Image

చదువుకు మనిషి నాగరికతను మార్చడంతో పాటు జీవితాన్ని మార్చగల శక్తి ఉందని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్, తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. విజయవాడలోని గురు నానాక్ కాలనీలో మణికంఠ నూతనంగా ఏర్పాటు చేసిన చుబ్బి పాఠశాలను తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం తుడా చైర్మన్ కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల తరగతులను గదులను ప్రారంభించి విలువలతో కూడిన విద్యను అందించాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు. మనిషి యొక్క స్థితిని గతిని మార్చగలగే శక్తి చదువుకు ఉందని తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్రంలో చదువుకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని తెలియజేశారు.

డబ్బు లేదన్న కారణంతో ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని తీసుకుని వచ్చి ఇంటిలో ఎంత మంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 చొప్పున గురువారం రోజున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అందరి విద్యార్థుల తల్లుల ఖాతాకు నగదు జమ చేయడం జరిగిందని వివరించారు.

Tags
changes life education life talliki vandanam scheme
Recent Comments
Leave a Comment

Related News