వంద కోట్లు.. నాని కి కేక్ వాక్

admin
Published by Admin — May 06, 2025 in Movies
News Image

కొన్నేళ్ల ముందు వరకు నాని సినిమాలు హిట్టయితే 50-60 కోట్ల వసూళ్లు సాధించేవి. చాలా ఏళ్ల పాటు ఆ లీగ్‌లోనే ఉండిపోయాడు నాని. కానీ ‘దసరా’తో అతడి సినిమాల లెక్కలు మారిపోయాయి. భారీ ఓపెనింగ్స్ సాధించిన ఆ చిత్రం నాని కెరీర్లో తొలి వంద కోట్ల సినిమాగా నిలిచింది. కానీ తర్వాతి చిత్రాలతో ఆ మైలురాయిని అందుకోలేకపోయాడు నాని. ‘హాయ్ నాన్న’ పూర్తిగా క్లాస్ సినిమా కావడంతో హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఎక్కువ వసూళ్లు రాబట్టలేదు. ‘సరిపోదా శనివారం’ మంచి హైప్ తెచ్చుకున్నప్పటికీ.. డివైడ్ టాక్, వర్షాల వల్ల వంద కోట్ల సినిమా కాలేకపోయింది. కానీ ‘హిట్-3’కి బంపర్ క్రేజ్ రావడం, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఒక రేంజిలో జరగడంతో ఇది వంద కోట్ల సినిమా అవుతుందనే అంచనాలు ఏర్పడ్డాయి. అనుకున్నట్లే ఆ సినిమా ఆ క్లబ్బులోకి అడుగుపెట్టేసింది.

విడుదలైన నాలుగో రోజుకే ‘హిట్-3’ వరల్డ్ వైడ్ వసూళ్లు రూ.100 కోట్ల మార్కును టచ్ చేశాయి. తొలి రోజు రూ.40 కోట్లకు పైగా కొల్లగొట్టిన ‘హిట్-3’ 2, 3 రోజుల్లో ఓ మోస్తరు వసూళ్లు సాధించింది. ఆదివారం వసూళ్లు పుంజుకున్నాయి. దీంతో వంద కోట్ల మైలురాయిని దాటేసింది. విశేషం ఏంటంటే.. యుఎస్‌లో తొలి వీకెండ్లోనే ఈ సినిమా 2 మిలియన్ డాలర్ల క్లబ్బులోకి అడుగుపెట్టేసింది. నాని అదే టైంలో అక్కడికి వెళ్లి సినిమాను ప్రమోట్ చేస్తుండడంతో సినిమాకు ఇంకా రన్ కొనసాగేలా ఉంది. యుఎస్‌లో ఈ సినిమా ఆల్రెడీ లాభాల బాట పట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ఏరియాల్లో సినిమా దాదాపుగా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఎక్కడా రికవరీ 70 శాతానికి తక్కువగా లేనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇకపై నాని సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వంద కోట్ల వసూళ్లు కేక్ వాకే అన్న అంచనాలు కలుగుతున్నాయి. ‘ది ప్యారడైజ్’కు పాజిటివ్ టాక్ వస్తే రూ.200 కోట్ల మైలురాయిని అందుకున్నా ఆశ్చర్యం లేదు.

Tags
actor nani Hit 3 Hit 3 Collections nani Telugu movies Tollywood
Recent Comments
Leave a Comment

Related News