ప్రముఖ నిర్మాత బన్నీ వాసు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. అల్లు అర్జున్ కు క్లోజ్ ఫ్రెండ్, అల్లు అరవింద్ కు అత్యంత సన్నిహితుడు.. గీత ఆర్ట్స్ ను ముందుండి నడిపించడంలోనూ బన్నీ వాసు కీలకపాత్రను పోషిస్తున్నాడు. అల్లు అరవింద్ ను బన్నీ వాసు గాడ్ ఫాదర్ ల భావిస్తుంటాడు. ఆయన సపోర్ట్ తోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న బన్నీ వాసు.. ఇప్పుడు బీవీ వర్క్స్ పేరుతో కొత్త బ్యానర్ ను స్టార్ట్ చేశాడు.
ఈ బ్యానర్ ద్వారా `మిత్రమండలి` అనే సినిమాను నిర్మించారు. ఇందులో కమెడియన్ కమ్ హీరో ప్రియదర్శి, యూట్యూబ్ స్టార్ ప్రసాద్ బెహరా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక, రాగ్ మయూర్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. అల్లు అరవింద్ స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు. అయితే ఎంతో సందడిగా సాగిన ఈ ఈవెంట్ లో అల్లు అరవింద్ పై బన్నీ వాసు చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
ఈవెంట్ లో యాంకర్ స్రవంతి మీ లవ్ స్టోరీ గురించి చెప్పమనగా.. అందుకు బన్నీ వాసు మాట్లాడుతూ `నేను 19 ఏళ్ళ వయసులో అరవింద్ గారి దగ్గరకు వచ్చాను. అక్కడ్నుంచి ఆయన నన్ను బన్నీ కి వాచ్ మెన్ చేశారు. నా లైఫ్ అంతా కాపలా కాయడానికే సరిపోయింది. నా జీవితంలో లవ్ పార్ట్ మిస్ అయిందంటే దానికి వంద శాతం కారణం అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్‌నే` అంటూ వ్యాఖ్యానించారు. బన్నీ వాసు సరదాగానే ఈ కామెంట్స్ చేసినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.