టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఎన్నోసార్లు ఈ జంట తమ రిలేషన్ ను కన్ఫామ్ చేస్తూ వచ్చారు. ఇక తాజాగా రష్మిక తో పెళ్లిపై ఓపెన్ అయ్యాడు విజయ్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ `కింగ్‌డమ్` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్.. వృత్తిపరమైన విషయాలు కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు.
ఈ క్రమంలోనే పెళ్లి, రష్మిక గురించి ప్రశ్నలు ఎదురవ్వగా విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేషనర్ గురించి మాట్లాడుతూ.. `రష్మికతో ఇంకొన్ని సినిమాలు చేయాలనుంది. ఆమె అందమైన నటి. అంతకన్నా మంచి మనసు ఉన్న మనిషి` అంటూ విజయ్ ప్రశంసలు కురిపించారు. పెళ్లెప్పుడు చేసుకుంటారని ప్రశ్నించగా.. ప్రస్తుతం జీవిత భాగస్వామి గురించి పెద్దగా ఆలోచించడం లేదని, కానీ తప్పకుండా ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుంటానని సమాధానం ఇచ్చాడు.
దాంతో విలేకరి మీ జీవిత భాగస్వామికి ఉండాల్సిన లక్షణాలు రష్మిక లో ఉన్నాయా? అంటూ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వేయగా.. `మంచి మనసు ఉన్న అమ్మాయి ఎవరైనా పర్వాలేదు` అంటూ విజయ్ బదులిచ్చాడు. విజయ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. రష్మికతో మన రౌడీ హీరో పెళ్లిని ఆల్మోస్ట్ కన్ఫార్మ్ చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, కింగ్‌డమ్ విషయానికి వస్తే.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. భాగ్యశ్రీ బోర్సే ఇందులో విజయ్ దేవరకొండకు జోడీగా నటించింది. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.