పిఠాపురం వర్మ వ్యవహారం కూటమి సర్కారులో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇప్పటివరకు పరిస్థితి ఎలా ఉన్నా… `ఇక నుంచి నేనేంటో తెలుస్తుంది“ అంటూ.. వర్మ శాంత వచనాలే పలికినా.. ఆయన దూకుడు చూస్తే మాత్రం డిఫరెంట్‌గా కనిపిస్తోంది. దీంతో అసలు వర్మ శాంతించడం లేదన్న టాక్‌వినిపిస్తోంది. తాజాగా.. గత నాలుగు రోజుల నుంచి ఆయన క్షేత్రస్థాయిలో ఓ రేంజ్‌లో తిరిగేస్తున్నారు. ఇసుక, మట్టి అక్రమాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.
ఓ వర్గం మీడియాను పిలిపించుకుంటున్న వర్మ… క్షేత్రస్థాయిలో వారిని కూడా వెంటబెట్టుకుని తీసుకువె ళ్లి.. మట్టి, ఇసుక తవ్వకాల ప్రాంతాలను చూపిస్తున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? అని నిలదీస్తు న్నారు. అదేసమయంలో తాను రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేద ని.. ప్రజల సొమ్మును దోచేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి నిన్న మొన్నటి వరకు కూడా.. పెద్ద ఎత్తున ఆయన విమర్శలు చేయాలని అనుకుని కూడా మౌనంగా ఉన్నారు.
కానీ.. ఇటీవల కాలంలో మాత్రం ఆధారాలు చూపిస్తూ.. కీలక పాయింట్లను లేవనెత్తుతున్నారు. ఇది ఒక రకంగా సర్కారును ఇరకాటంలో పెడుతున్న విషయం తెలిసిందే. అయితే.. దీనికి కారణం.. వర్మను పక్కన పెడుతున్నారన్న చర్చ ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు ఆయనకు ఏదో ఒక పదవి ఇచ్చేస్తే.. సరిపోతుందని.. కానీ, అలా చేయకుండా నాన్చుతున్నారన్న వాదనా ఉంది. ఇప్పటి వరకు అనేక మందికి పదవులు ఇచ్చినా.. వర్మకు మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు.