ఇది మ‌రీ విడ్డూరం.. వైసీపీ పై లోకేష్ సెటైర్స్‌!

News Image
Views Views
Shares 0 Shares

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఎనిదిమి నెల‌లు గ‌డుస్తున్న ఇచ్చిన హామీల‌ను ఇంత‌వ‌ర‌కు నెల‌బెట్టుకోలేదంటూ వైసీపీ నాయ‌కులు నానా హంగామా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు విద్యార్థుల‌ను అడ్డుపెట్టుకుని ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేస్తోంది వైసీపీ. ఇందులో భాగంగానే ఫిబ్ర‌వ‌రి 5న `ఫీజు పోరు` పేరుతో ఉద్య‌మానాకి రెడీ అవుతోంది. రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి రూ.3,900 కోట్ల బకాయిలు ఉన్నాయ‌ని.. ప్రభుత్వం వాటిని ఇంకా చెల్లించక‌పోవ‌డంతో విద్యా సంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని వైసీపీ ఆరోప‌ణ‌లు చేస్తోంది.|

విద్యార్ధుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోంద‌ని విమ‌ర్శిస్తోంది. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల కోసం ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి వైసీపీ నేతలు, విద్యా సంఘాల ప్రతినిధులు కలెక్టర్లకు డిమాండ్ పాత్రలు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ విష‌యంపై టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నారా లోకేష్‌ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ చేప‌ట్ట‌బోయే `ఫీజు పోరు`పై మాట్లాడారు. రూ.3వేల కోట్ల ఫీజు రియంబర్స్ బకాయిలు పెట్టింది వైసీపీ ప్ర‌భుత్వ‌మే.. ఇప్పుడు వైసీపీ వాళ్లే ఫీజు బకాయిల పై ఆందోళ‌న చేయ‌డం మ‌రీ విడ్డూరంగా ఉంద‌ని లోకేష్ సెటైర్స్ పేల్చారు. అలాగే కూట‌మి అధికారంలోకి వ‌చ్చాక రూ.800 కోట్ల రియంబర్స్ బకాయిలు చెల్లించామ‌ని లోకేష్ గుర్తు చేశారు. గత ప్రభుత్వం పెట్టిన ధాన్యం పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల బకాయిలు ఒక్కొక్క‌టిగా తీరుస్తున్నామ‌ని మంత్రి లోకేష్ స్ప‌ష్టం చేశారు.

 

Recent Comments
Leave a Comment

Related News