టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో బాబీ కొల్లి(కె.ఎస్. రవీంద్ర) ఒకరు. అయితే తాజాగా బాబీ కి తన అభిమాన హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి నుంచి ఊహించని సర్ప్రైజ్ వచ్చింది. బాబీని స్వయంగా ఇంటికి పిలిచిన చిరంజీవి.. ఖరీదైన వాచ్ ను గిఫ్ట్ గా బహుకరించారు. ఒమేగా సీ మాస్టర్ వాచ్ ను బాబీ చేతికి తొడిగారు చిరు. ఇందుకు సంబంధించిన ఫోటోలను డైరెక్టర్ బాబీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
`బాస్ స్వయంగా ఇచ్చిన అందమైన మెగా సర్‌ప్రైజ్. ఈ అమూల్యమైన బహుమతికి ఇచ్చినందుకు ప్రియమైన మెగాస్టార్ కి ధన్యవాదాలు మీ ప్రేమ, ప్రోత్సాహం మరియు ఆశీర్వాదాలు నాకు ప్రపంచం అన్నయ. ఈ క్షణాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను` అంటూ బాబీ తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. చిరంజీవి బాబీకి బహుకరించిన వాచ్ విలువ రూ. 6 నుంచి 10 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు.
కాగా, గతంలో చిరంజీవి – బాబీ కాంబినేషన్ లో వచ్చిన `వాల్తేరు వీరయ్య` చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఫ్లాపుల్లో ఉన్న చిరంజీవిని సక్సెస్ ట్రాక్ ఎక్కించిందీ చిత్రం. అయితే వాల్తేరు వీరయ్య విడుదలైన రెండేళ్లకు దర్శకుడిని ఇంటికి పిలిచి చిరంజీవి గిఫ్ట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. గతంతో చిరు-బాబీ కాంబోలో మరో సినిమా సెట్ అయినట్లు వార్తలు వస్తున్నారు. తాజా పరిణామం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చినట్లు అయింది.