పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో `ఫౌజీ` ఒకటి. `సీతారామం` మూవీతో ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ సెన్సేషన్ హిట్ అందుకున్న హను రాఘవపూడి తొలిసారి ప్రభాస్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి హీరోయిన్ గా ఎంపిక అయింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు దాదాపు రూ. 700 కోట్ల బడ్జెట్ తో భారీ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫౌజీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రాహుల్ రవీంద్రన్, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా.. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవలె ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. అయితే తాజాగా ఫౌజీ సెట్స్ నుంచి ప్రభాస్ లుక్ నెట్టింట లీక్ అయింది.
ఫార్మల్ ప్యాంట్, ఫార్మల్ షర్ట్ వేసుకుని క్లాసీ లుక్‌లో సూపర్ స్లిమ్ అండ్ హ్యాండ్సమ్ గా ప్రభాస్ దర్శనమిచ్చాడు. ప్రభాస్ లుక్ చూసి అభిమానులే కాదు సాధారణ సినీ ప్రియులు కూడా పిచ్చెక్కిపోతున్నారు. ఏమున్నాడ్రా బాబు.. ఎన్నేళ్లైంది ప్రభాస్ ను ఇలా చూసి అంటూ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. కాగా, రెండో ప్రపంచ యుద్ద కాలంలో జరిగే ప్రేమ కథగా ఫౌజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అనౌన్స్‌మెంట్ రోజే ఈ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ చేసింది. 2026 సమ్మర్ లో ఫౌజీ రిలీజ్ కావొచ్చని అంటున్నారు.