ఉమ్మడి కృష్నాజిల్లాలోని గుడివాడ అంటే.. మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు కొడాలి నానికి పట్టుగొమ్మ. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన గుడివాడపై పెద్ద ముద్రే వేశారు. టీడీపీతో ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆతర్వాత అదే టీడీపీపై నిప్పులు చెరు గుతూ.. వైసీపీలోకి దూసుకుపోయారు.ఈ క్రమంలోనే మంత్రి అయ్యారు. మాజీ సీఎం చంద్రబాబుపై తరచుగా విరుచుకుపడి.. అదే గుర్తింపు అనుకునేవారు. నోరు విప్పితే బూతులు మాట్లాడతారన్న బ్యాడ్ నేమ్ కూడా తెచ్చుకున్నారు. ఇక, వైసీపీలో ఓడిపోయిన తర్వాత.. ఆయన నియోజకవర్గానికి దూరమయ్యారు.
ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో హైదరాబాద్-బెంగళూరులో ఉంటూవచ్చారు. తాజాగా శుక్రవారం సాయంత్రం ఆయన తన సొంత నియోజకవర్గానికి వచ్చారు. దాదాపు ఏడాది తర్వాత.. ఆయన నియోజకవర్గానికి వస్తుండడంతో సందడి, ఆర్భాటం జోరుగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ, ఎవరూ రాలేదు. ఆయనను పెద్ద ఎత్తున సత్కరించి.. స్వాగతాలు కూడా పలకలేదు. అంతేకాదు.. కీలక నాయకులు,కార్యకర్తలు, అనుచరులు కూడా నాని పర్యటనకు దూరంగా ఉన్నారు. అయితే.. ముందుగానేపోలీసులు హెచ్చరించడంతోనే వారు దూరమయ్యారన్న చర్చ కూడా నడుస్తోంది.
ఎందుకు వచ్చారు?
ఇక, ఏడాది తర్వాత.. నాని ఎందుకు వచ్చారు? అనేది ప్రశ్న. గతంలో టీడీపీ గుడివాడ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వ రరావు ఇంటిపై దాడి జరిగింది. అప్పట్లో కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ కేసును కూటమి ప్రబుత్వం వచ్చాక... తిరగదో డింది. దీనిలో నానీని కూడా చేర్చారు. ఆయన చెబితేనే తాము దాడి చేశామని.. నాని అనుచరులు వాంగ్మూలం ఇవ్వడంతో కొడాలిని ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఏర్పడింది. దీనిపై ఆయన హైకోర్టుకు వెళ్లి.. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిం చారు.
కానీ, స్థానిక కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు పేర్కొంది. దీంతో నాని.. గుడివాడకు వచ్చి.. స్థానిక కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌దాఖలు చేశారు. ఇదీ.. ఆయన రాకకు కారణం. కాగా.. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎన్నారై నాయకుడు.. వెనిగండ్ల రాము ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో 20 సంవత్సరాలకు పైగా గుడివాడలో ఓ వెలుగు వెలిగిన కొడాలి ప్రభ ఆగిపోయింది.