మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వైసీపీ కార్యకర్త మరణించిన సంగతి తెలిసిందే. జగన్ కారు కింద పడి సింగయ్య చనిపోయిన వీడియో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే జగన్ పై కూడా కేసు నమోదైంది. అయితే, తనపై కేసు క్వాష్ చేయాలంటూ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే జగన్ కు హైకోర్టులో ఊరట లభించింది.
సింగయ్య మృతి కేసులో జగన్‌ను పోలీసులు విచారణ జరపవద్దని స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ఏజీ 2 వారాల గడువు కోరడంతో విచారణను వాయిదా వేసింది.