వైసీపీ నాయకుల వ్యవహారాలు.. అన్నీ ఇన్నీ కావన్న ప్రచారం జరుగుతూనే ఉంది. తాజాగా యువతులకు ఉపాధి చూపిస్తామని పిలిచి వ్యభిచారంలోకి దింపిన వైసీపీ నేత వ్యవహారం వెలుగు చూసింది. గతంలో(రెండు నెలల కిందట. విజయవాడలో) కూడా ఓ నాయకుడు స్పా సెంటర్‌లో వ్యభిచారం చేస్తూ.. పట్టుబడిన విషయం అప్పట్లో కలకలం రేపింది. అయితే.. ఆయన కూటమి నేతలతో చేతులు కలిపి.. తర్వాత ఆకేసు నుంచి బయట పడ్డారన్న ప్రచారం మరింతగా కాక రేపింది. ఆ తర్వాత కేసు ఎటు పోయిందో.. ఆయన నాయకుడి వ్యవహారం ఏమైందో కూడా తెలియలేదు.
తాజాగా ఓ వైసీపీ నాయకుడి లాడ్జి వ్యభిచార కేంద్రంగా మారిన ఘట్టం వెలుగు చూసేసరికి అందరూ ఖిన్నులయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి యువతులనుతీసుకువచ్చి..ఇ క్కడ గుట్టుగా వ్యవహారం సాగిస్తున్నారని పోలీసులు గుర్తించారు. విజయవాడ లో అత్యంత రద్దీగా ఉండే గవర్నర్ పేటలో వైసీపీ నేత కోసూరి సుబ్రహ్మణ్యం ఓ భవనంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. దీనిపై తాజాగా పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన దాడులు చేసి గుట్టురట్టు చేశారు.
ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యబిచారం నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. పోలీసుల మెరుపు దాడులతో అందరూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. నిర్వాహకుడు సుబ్రహ్మణ్యం.. ఆయన సహాయకారుడు ఆండ్రాజు బాలకృష్ణతో పాటు చిన్నం రంగా సాయినాథ్ తేజపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఇక్కడకు ఉపాధి చూపిస్తామని.. చెప్పి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, కర్ణాటకల నుంచి యువతులను తీసుకువస్తున్నారని పోలీసులు గుర్తించారు. వచ్చిన తర్వాత.. వారిని వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని.. తెలిపారు. మొత్తానికి వైసీపీ నేతల లీలలు దారుణంగా మారడంతో అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.