మంత్రి నారా లోకేశ్ ను టాలీవుడ్ నటుడు శివాజీ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని లోకేశ్ నివాసంలో ఈ భేటీ జరిగింది. లోకేశ్ నాయకత్వ పటిమ తనకెంతో స్ఫూర్తినిచ్చిందని శివాజీ అన్నారు. తమ మధ్య జరిగిన అర్థవంతమైన చర్చను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని చెప్పారు. లోకేశ్‌ను ‘ప్రజా గొంతుక’ (The Voice Of People) అని శివాజీ ప్రశంసించారు.
ఈ భేటీ సందర్భంగా లోకేశ్ తనకు ‘The Voice Of People: Nara Lokesh’ పుస్తకాన్ని బహూకరించారని తెలిపారు. వైసీపీకి వ్యతిరేకంగా చాలాకాలంగా గళం విప్పుతున్న శివాజీ తాజాగా లోకేశ్‌ను కలవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. శివాజీ పట్ల బీజేపీ పెద్దలకు కూడా సదభిప్రాయం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో శివాజీకి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తారా అన్న విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.