మెగా ఫ్యామిలీలో మరో మెంబర్ యాడ్ అయ్యారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని రైయిన్‌బో హాస్పిటల్ లో లావణ్య త్రిపాఠి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కొణిదెల వారింటికి తొలి మెగా వారసుడు వచ్చాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా ఫాన్స్ వరుణ్ తేజ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మరోవైపు లావణ్యకు బాబు పుట్టడంతో మెగా ఇంట సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బేబీ బాయ్ ను చూసేందుకు హాస్పిటల్ కి క్యూ కడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా `మన శంకర్ వరప్రసాద్ గారు` మూవీ సెట్స్ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి వరుణ్ తేజ్, లావణ్య దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, 2017లో `మిస్టర్` సినిమాతో వరుణ్, లావణ్య మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమగా మారింది. దాదాపు ఐదేళ్లు సీక్రెట్ రిలేషన్ లో ఈ జంట.. 2023లో ఇటలీ వేదికగా వివాహం చేసుకున్నారు. ఇక ఈ ఏడాది మేలో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు గుడ్ న్యూస్ సంచుకున్నారు. తాజాగా ఈ జంట తమ ఫస్ట్ చైల్డ్‌కు వెల్కమ్ చెప్పేశారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని సమాచారం.