`మిరాయ్` మూవీతో యంగ్ హీరో తేజ సజ్జా మరో పాన్ ఇండియా హిట్ కొట్టేశాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్. మంచు మనోజ్, శ్రియా శరణ్, జగపతి బాబు, జయరామ్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన మిరాయ్.. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 12న విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది.
తేజ సజ్జా - మంచు మనోజ్ యాక్టింగ్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్, ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ హైలెట్స్ గా నిలిచాయి. అక్కడక్కడా కొంత సాగదీత ఉన్నా ఓవరాల్‌గా సినిమా బాగుందని మెజారిటీ ఆడియెన్స్ అభిప్రాయపడ్డారు. అయితే మిరాయ్ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. మిరాయ్ కు ఫస్ట్ తేజ కాదట.
సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని మూడేళ్ల క్రితమే ఈ సినిమా కథను రెడీ చేసుకున్నాడట. తేజ కన్నా ముందు టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలను సంప్రదించాడట. ఈ క్రమంలోనే న్యాచురల్ స్టార్ నానికి స్టోరీ నచ్చడంతో ఆయన కార్తీక్ డైరెక్షన్ లో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. కానీ రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలో డీల్ సెట్ కాకపోవడంతో నాని వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఫైనల్ గా తేజకు ఓటేశాడు కార్తీక్. స్టోరీ నచ్చడంతో తేజ కూడా మరో ఆలోచన లేకుండా మిరాయ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కట్ చేస్తే పాన్ ఇండియా హిట్ కొట్టారు. ఈ విజయం అతని కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. మొత్తానికి ఆ విధంగా నాని చేయాల్సిన మిరాయ్.. తేజ ఖాతాలో పడిపోయిందని నెట్టింట ప్రచారం జరుగుతోంది.