జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో అధికార పార్టీ కాంగ్రెస్‌కు కీలక సహకారం అందివచ్చింది. దీంతో ఒకింత ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. నియోజకవర్గంలో 25 శాతం మేరకు ఉన్న మైనారిటీ ఓటు బ్యాంకు.. వ్యవహారం ఆది నుంచి చర్చనీయాంశంగానే ఉంది. ఎంఐఎం పార్టీ ఎటు మొగ్గితే.. అటు వైపు మైనారిటీ ఓట్లు పడతాయన్న చర్చ ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ ఎస్‌లు.. ఎంఐఎం నిర్ణయం కోసం వేచి చూశాయి.
కానీ, బీహార్ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్.. జూబ్లీహిల్స్ ఉప పోరును లైట్ తీసుకున్నారు. దీంతో మైనారిటీ ఓటర్లు ఎటు మొగ్గుతారన్న చర్చ కొనసాగుతూనే ఉంది. అయితే.. ఈ చర్చకు దాదాపు ఫుల్ స్టాప్ పెడుతూ.. మైనారిటీ వర్గాలకు చెందిన నాయకులు.. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్ పరిధిలోని మైనారిటీలంతా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటారని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించుకునే బాధ్యత కూడా తమదేనన్నారు.
ఏంటి రీజన్..
తాజాగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీంతో కాంగ్రె స్ పార్టీ ఆశించినట్టే.. మైనారిటీ వర్గంలో కదలిక వచ్చింది. మైనారిటీ నేతలు.. సీఎంకు ధన్యవాదాలు కూ డా చెప్పారు. దీంతో కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్‌లో ఒకింత ఊపిరి పీల్చుకునే అవకాశం చిక్కిందని అంటు న్నారు. ఇదిలావుంటే.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పలువురు మైనారిటీలకు మంత్రి పదవులు ఇచ్చినప్ప టికీ ఒక్కరు కూడా విజయం దక్కించుకోలేక పోయారు.
దీంతో ఆ వర్గానికి కేబినెట్‌లో చోటు దక్కలేదు. ఇక, ఇప్పుడు అజ్జుభాయ్‌కు చోటు ఇస్తుండడం పట్ల మైనా రిటీ వర్గాలు హ్యాపీగా ఫీలవుతున్నాయి. ఇది తమకు జూబ్లీహిల్స్‌లో కలిసి వచ్చే పరిణామమేనని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. అందుకే.. తాజాగా మంత్రి భట్టి మాట్లాడుతూ.. మేం సేఫ్ జోన్‌లోకి వచ్చేశాం.. అని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యతను భట్టి తీసుకున్న విషయం తెలిసిందే.