మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించేందుకు చేస్తున్న అధికారిక పర్యటనలను రాజకీయంగా మలిచే ప్రయత్నం చివరికి పూర్తిగా విఫలమైంది. నారా లోకేష్ ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తున్నారనే విషయాన్ని సంచలనంగా చూపిస్తూ జగన్ సొంత మీడియా సాక్షి ప్రచారం చేసిన కథనాలన్నీ ఆర్‌టీఐ ద్వారా ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. హైదరాబాద్‌కు 77 సార్లు వెళ్లారని, అక్కడ సేదతీరుతున్నారని, ప్రభుత్వ ధనాన్ని వాడుతున్నారని సాక్షి చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలుగా తేలిపోయింది.
లోకేష్ చేసిన పర్యటనల్లో ఒక్కటీ వ్యక్తిగత ప్రయాణం కాదు. మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖలకు సంబంధించిన అధికారిక పనులకోసమే ఆ విమాన ప్రయాణాలు జరిగాయని ఆర్‌టీఐ అధికారులు స్పష్టంగా తెలిపారు. ముఖ్యంగా ఆ పర్యటనల కోసం ఆయన శాఖల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సమాచారం బయటపడింది. అంటే 77 సార్లకు పైగా చేసిన ప్రయాణాలన్నీ వైవసాయ శాఖ బడ్జెట్‌తో కాకుండా, లోకేష్ స్వంత సొమ్ముతోనే నిర్వహించబడినట్టుగా రికార్డులు రుజువయ్యాయి.
లోకేష్‌కు క్లీన్ చిట్ రావడంతో రాజకీయంగా టార్గెట్ చేస్తూ సాక్షి వేసిన ఆరోపణలు ప్రజలకే నవ్వుల పాలు అవుతున్నాయి. రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికే ఈ ప్రచారం చేశారని టీడీపీ నేతలు జగన్ మీడియాపై ఘాటుగా స్పందిస్తున్నారు. లోకేష్ తెలంగాణ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. బాధ్యతల రీత్యా ఆయన తరచూ హైదరాబాద్‌కు వెళ్లాల్సిందే. అదనంగా పెట్టుబడుల సాధన కోసం, రాష్ట్రంలో ఉన్న ఐటీ & ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమైన మీటింగ్స్ కోసం ప్రత్యేక ఫ్లైట్లలో ప్రయాణించడం సహజం. కానీ ఈ అధికారిక పర్యటనలను వ్యక్తిగత ప్రయాణాలుగా చూపించడం పూర్తిగా రాజకీయ దాడి అంటూ టీడీపీ నేతలు మండిపడతున్నారు. గతంలో తాడేపల్లి ప్యాలెస్‌కు 15 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉన్న కార్యక్రమానికి కూడా జగన్ ప్రత్యేక విమానం వినియోగించిన ఉదంతం ప్రజలందరికీ తెలుసు.. కానీ లోకేష్ అధికారిక పర్యటనలకు సైతం తన సొంత డబ్బునే వాడుతున్నారని గుర్తుచేస్తున్నారు.