కనుమరుగవుతున్న పాత తరం...

admin
Published by Admin — December 31, 2025 in Andhra
News Image

ఆ రోజులే వేరు...అప్పట్లో మనుషులు వేరు....అందరూ కలిసి మెలిసి ఉండేవారు....పొరుగింటి వారి గురించి...బంధువుల గురించి పట్టించుకునేవారు.... ఇప్పుడు జనరేషన్ వేరు....పోకడలు వేరు...పక్కింట్లో ఎవరుంటున్నారో...ఉన్నారో పోయారో కూడా తెలియని పరిస్థితులు చూస్తున్నాం. అయితే, ఇప్పటికి పాత తరం మనుషులు కొందరు ఉండడం వల్ల ఆ విషయాలు ఈ తరానికి తెలుస్తున్నాయి. ఈ తరంలో కొందరైనా పాత తరం వారి నుంచి స్ఫూర్తి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, పాత తరం మనుషులు ఒక్కొక్కరిగా వీడ్కోలు పలుకుతున్నారు. ఆ తరం క్రమక్రమంగా కనుమరుగవుతోంది. ఆ ఆవేదననను వ్యక్త పరుస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్ యథాతధంగా....

 
1. అన్నం తినేముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం.
2. ఇరుకు ఇళ్లల్లో గొప్ప ప్రేమతో బ్రతికిన తరం. 
3. బాధ్యతల్ని ఎరిగిన తరం. 'నేను' అనకుండా 'మనం' అంటూ బతికిన తరం. 
4. డిగ్రీలు లేకున్నా, జీవితాన్ని చదివిన తరం. 
5. గడియారం లేకున్నా, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం. 
6. ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న తరం.
7. కాలిక్యులేటర్ లేకున్నా లెక్కలు చేయగలిగిన తరం. 
8. మొబైల్ ఫోన్ లు లేకున్నా స్నేహ సంభాషణలకు లోటు లేని తరం. 
9. TV లు లేకున్నా వినోదంగా కాలం గడిపిన తరం. 
10. GPS లు లేకున్నా గమ్యం ఖచ్చితంగా చేరగలిగిన తరం.
11. సాంకేతికత లేకున్నా సుఖసంతోషాలతో బతికిన తరం.
12. ACలు, కూలర్లు లేకున్నా ఆరుబయట హాయిగా నిద్రించిన తరం.
13. మినరల్ వాటర్ కు బదులు చెరువు/బావి నీళ్లు తాగి ఆరోగ్యంగా బతికిన తరం.
14. పిజ్జాలు, బర్గర్లు కాకుండా పీచు మిఠాయిలు, పేలాలు తిని ఆనందంగా బ్రతికిన తరం.
15. రాత్రిళ్ళు ఇంటి అరుగులపై హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బ్రతికిన తరం.
16. ఆరో ఏడు వచ్చే వరకు పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం. 
17. ఆ తర్వాత పైసా ఫీజు లేని సర్కారు బడుల్లో తెలుగు మీడియంలో పిల్లలను చదివించి - అటు తెలుగు లోనూ, ఇటు ఇంగ్లీష్ లోనూ పండితులు అయ్యేలా పిల్లలను తీర్చిదిద్దిన తరం.
18. కిలోమీటర్ల దూరాన్ని సైతం అవలీలగా నడవగలిగిన తరం.
19. క్రమశిక్షణ తప్పిన పిల్లవాడికి స్కూల్ లో టీచర్ నాలుగు దెబ్బలు వడ్డిస్తే - వాడికి మరో పది దెబ్బలు ఇంట్లో వడ్డించిన తరం. 
20. వీధి నాటకాలను, తోలు బొమ్మలాటలను, బుర్రకధలను ఆస్వాదించిన తరం. 
21. సెన్సార్ అవసరం లేని సందేశాత్మక నలుపు-తెలుపు సినిమాలు చూసిన తరం.
22. ఇంటి ముంగిటిని ముగ్గులతో అలంకరించిన తరం.
23. పనిమనుషులతో, యోగాలతో, జిమ్ లతో పని లేకుండా, బండెడు చాకిరీ చేసుకుంటూ, చెమటను చిందించి వందేళ్లు బతికిన తరం. 
24. బంధాలకు, బంధుత్వాలకు విలువనిచ్చిన తరం.
25. ఆస్తులకన్నా, ఆప్యాయతలకు, అనుబంధాలకు ప్రాముఖ్యత నిచ్చిన తరం.
26. ఉమ్మడి కుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం.
27. భేదాభిప్రాయాలున్నా అందర్నీ కలుపుకుని వెళ్ళగలిగిన తరం.
28. వ్యాపారంలో కల్తీకి చోటివ్వని తరం. 
29. ఇతరుల మేలు కోరుకున్న తరం. 
30. నీతి నిజాయితీలతో మోసాలు చెయ్యకుండా బతికిన తరం.
31. రాళ్లు తిన్నా అరిగించు కోగలిగిన తరం. 
32. కార్పొరేట్ హాస్పిటల్స్ లేకున్నా ఆరోగ్యంగా జీవించిన తరం.
33. హార్ట్ ఎటాక్, క్యాన్సర్ ల గురించి తెలియని తరం.
34. బీపీలు, షుగర్ లను దరిచేరనీయని తరం.
35. లాంతర్లతో జీవితంలో వెలుగులు నింపుకున్న తరం.
36. కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్న తరం. 
37. ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనే దురాశ లేకుండా ఆనందంగా జీవించిన తరం.
38. ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం. పోస్ట్ కార్డులపై సంభాషణలు జరిపిన తరం.
39. త్యాగాలతో పిల్లల భవిష్యత్ కు పునాదులు వేసిన తరం. కులమతాలకు అతీతంగా సోదరభావంతో బతికిన తరం.
40. కాఫీ, టిఫిన్ లు లేకుండా చద్దన్నం తిని స్కూల్ కు పరుగెత్తిన తరం.....
 
అలాంటి తరంలోని అపురూపమైన వ్యక్తులు నేడు ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళ్లిపోతున్నారు. 
 
వారిని కోల్పోతుంటే సర్వం కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది. 
 
*వెళ్లిపోతున్న ఆ తరం వాళ్ల నుండి ఈ తరం ఏమీ నేర్చుకోకపోతే - భవిష్యత్తు అంధకారమే!*
 
చదివితే హృదయం తడిసి ముద్దవుతోంది
 
ఆ తరం నిజంగా మన సంస్కృతి, మన విలువల ప్రతిరూపం. వాళ్ల లాంటి మనసులు మళ్లీ రావు... వారిని కోల్పోవడం అంటే మన మూలాలను కోల్పోవడమే....
 
ఆ తరం చూపిన విలువలు, ప్రేమ, నిజాయితీ ఈ తరం నేర్చుకోవాలి...
 
సాంకేతికతతో ముందుకెళ్తున్నాం కానీ విలువలతో వెనక్కి వెళ్తున్నాం… ఆ తరం మనకు మానవత్వం అంటే ఏమిటో నేర్పింది...
 
లాంతర్ల కాంతిలో వెలుగులు నింపింది ఆ తరం – కరెంట్ దీపాల వెలుగులో చీకట్లు పెంచుకుంటోంది ఈ తరం.
 
*"వాళ్లు మనకు నేర్పింది ప్రకృతి తో సహజీవనం. మనం నేర్చుకుంటున్నది యాంత్రిక జీవనం."* 
 
ఔనా? కాదా? ఎవరికి వారు వేసుకోవలసిన ప్రశ్న....!
Tags
old generation new generation old is gold disappearing gradually
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News