వైసీపీ ఎత్తు పార‌లేదు.. వ‌ర్మ యూట‌ర్న్‌!

admin
Published by Admin — March 11, 2025 in Politics
News Image

పిఠాపురం వ‌ర్మ‌గా పేరున్న టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ ఎన్ వ‌ర్మ విష‌యంలో వైసీపీ ఎత్తు పార‌లేదు. ఆయ‌న‌ను టీడీపీ నుంచి దూరం చేయాల‌న్న ఎత్తుగ‌డ‌ల‌తో దూసుకుపోయిన వైసీ పీకి ప‌రాభ‌వ‌మే మిగిలింది. గ‌తం నుంచి టీడీపీకి-వ‌ర్మ‌కు మ‌ధ్య వైసీపీ నాయ‌కులు పుల్ల‌లు పెడుతున్నా రు. ఇప్పుడు కూడా అదే ప‌నిచేశారు. అయితే.. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం, సౌమ్య‌త, అంత‌కు మించిన విధేయ‌త ఉన్న వ‌ర్మ ఎక్క‌డా వైసీపీ బుట్ట‌లో ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో వ‌ర్మ పిఠాపురం నుంచి పోటీ చేయాల‌ని అనుకున్నారు. చివ‌రి నిముషంలో పొత్తు కార‌ణంగా.. టీడీపీ ఈ టికెట్‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కు కేటాయించింది. దీనిపై అప్ప‌ట్లో వ‌ర్మ అనుచ‌రులు ఆగ్ర‌వేశాలు వెళ్ల‌గ‌క్కారు. అయితే.. చంద్ర‌బాబు ఆయ‌న‌ను పిలిచి బుజ్జ‌గించి.. త్వ‌ర‌లోనే ప‌ద‌వి ఇస్తాన‌ని.. ప‌వ‌న్‌ను భారీ మెజారిటీతో గెలిపించాల‌ని సూచించారు. విధేయ‌త‌కు పెద్ద‌పీట వేసే వ‌ర్మ‌.. బాబు చెప్పిన‌ట్టే చేశారు.

అయితే.. ప‌లు కార‌ణాల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర్మ‌కు ఎలాంటి ప‌ద‌వులు చిక్క‌లేదు. దీంతో అప్ప‌టి నుంచి వైసీపీ నాయ‌కులు వ‌ర్మ‌ను టీడీపీకి దూరం చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. టీడీపీ అధినేత ఇక‌, ప‌ట్టించు కోర‌ని.. వ‌ర్మ చూపులు ప‌క్క‌దారి ప‌డుతున్నాయ‌ని వైసీపీ ఆయ‌న‌కు ఆహ్వానం ప‌లికేందుకు రెడీగా ఉంద ని.. ఇలా ప‌లు క‌థ‌నాలు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ.. వ‌ర్మ త‌న ప‌నితాను చేసుకుని పోతున్నారు.

తాజాగా ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ టీడీపీ వ‌ర్మ‌కు టికెట్ ఇవ్వ‌లేదు. దీంతో ఇప్పుడు మ‌రోసారి వైసీపీ నాయ‌కులు వ‌ర్మ‌కు -బాబుకు మ‌ధ్య విభేదాలు సృష్టించే ప్ర‌య‌త్నం చేశారు. బాబు వాడుకుని వ‌దిలేసే ర‌క‌మంటూ కామెంట్లు చేశారు. అయితే.. వ‌ర్మ ఈ వ్యాఖ్య‌ల‌తో కుంగిపోలేదు. పొంగిపోలేదు. పైగా.. ఆయ‌న తాను.. టీడీపీలో నే ఉంటాన‌ని.. చంద్ర‌బాబు ఇబ్బందులు త‌న‌కు తెలుసున‌ని.. అస‌లు ప‌ద‌వి ఇవ్వ‌క‌పోయినా ఇష్ట‌మేన‌ని.. చంద్ర‌బాబు అడుగుజాడ‌ల్లో న‌డ‌వ‌డ‌మే త‌న‌కు గొప్ప ప‌ద‌వి అని స్ప‌ష్టం చేశారు. దీంతో వైసీపీ శిబిరాలు మూగ‌బోయాయి.

Recent Comments
Leave a Comment

Related News