ఆదివాసీలు ఒక్కసారి మనసు పెడితే.. ఇక ఊపిరి ఉన్నంత వరకు.. వారితోనే ఉన్నారు. ఇది వారి కట్టు బాటు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ తరహా మంచి తనాన్ని వారి దగ్గర సంపాయించుకున్నారు. అయితే.. తర్వాత కాలంలో జగన్ ప్రయత్నించినా.. అది సాకారం కాలేదు. అయితే.. ఇప్పుడు ఆదివాసీ తెగలు.. పవ న్ కల్యాణ్‌పై ప్రాణాలు పెట్టుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. తమ ఆపద్భాంధవుడిగా ఆయనను చూస్తు న్నారు.
ఈ బంధం బలపడుతోంది. నిజానికి పాడేరు ప్రాంతంలోని పలు గిరిజన తండాల్లో పవన్ కల్యాణ్.. అభి వృద్ధి పనులు చేశారు. ఆ తర్వాత.. వారికి చెప్పులు పంపించారు. ఇది.. మొదలు తరచుగా.. ఆయన గిరిజనులకు ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇటీవల ఓ మారుమూల గిరిజన తండాకు ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్ సౌకర్యం కల్పించారు. వారికి గృహోపకరణాలను కూడా పంపించారు.
ఈ పరిణామం.. గిరిజనుల్లో పవన్ కల్యాణ్‌పై ఎనలేని విశ్వాసాన్ని పెంచింది. ఆయనపై నమ్మకాన్ని పెం చింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు తమ ఆపద్భాంధవుడిగా.. పవన్ కల్యాణ్‌ను చూస్తు న్నారు. తమ సమస్యలు పరిష్కరించి.. తమ జీవితాల్లో వెలుగు ప్రసాదిస్తాడన్న విశ్వాసాన్ని ప్రకటిస్తు న్నారు. ఎంతో నమ్మకంతో ఉంటున్నారు. నిజానికి ఈ తరహా నమ్మకం.. విశ్వాసం.. ఇప్పటి వరకు ఎవరి విషయంలోనూ గిరిజనులు చూపించలేదనే చెప్పాలి.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కనుక ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే.. ఇక, ఎప్పటికీ తండా వాసులు ఆయన వెంటనే ఉంటారన్నది వాస్తవం. ఒక్కసారి తండావాసులు మనసు పెట్టుకుంటే..వారు ఎవరినీ వదులు కోరు. అందుకే.. గిరిజన నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఏళ్ల తరబడి అక్కడే తిష్ఠ వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా.. ఇప్పుడు పవన్ కనుక వారిస మస్యలను పరిష్కరించగలిగితే.. వ్యక్తిగతంగానే కాకుండా.. రాజకీయంగా కూడా ఆయనకు సుదీర్ఘ మేలు జరుగుతుందని అంటున్నారు పరిశీలకులు.